7 కే సు లు!

రాష్ట్రంలో 990కి పెరిగిన కరోనా కేసులు
ప్రజాపక్షం/హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టినట్లుగా కన్పిస్తోంది. శనివారంనాడు కేవలం 7 కేసులు మాత్రమే నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. కొత్తగా జిహెచ్‌ఎంసిలో ఆరు కేసులు, వరంగల్‌ అర్బన్‌లో ఒక కేసు నమోదైంది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 990కి పెరిగింది. శనివారం ఎవరూ డిశ్చార్జి కాకపోయినప్పటికీ, మొత్తంగా డిశ్చార్జి అయిన వారి సంఖ్య 307కి పెరిగింది. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌ కారణంగా 25 మంది మరణించారు. ప్రజలందరూ మాస్కులు ధరించాలని, ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఇంట్లోనే ఉంటూ సామాజిక దూరం పాటించాలని ఆరోగ్య శాఖ కోరింది.

DO YOU LIKE THIS ARTICLE?