6న జిశాట్‌-31 ప్రయోగం

బెంగళూరు: భారత రోదసి పరిశోధన సంస్థ(ఇస్రో) తన 40వ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ ‘జిశాట్‌-31’ను ఫ్రెంచ్‌ గయానా నుంచి బుధవారం ప్రయోగించడానికి అన్ని సిద్ధం చేసుకుంది. ఈ ఉపగ్రహం 15 ఏళ్లు సేవనందించనుంది. దీని బ రువు దాదాపు 2,535 కిగ్రా. ఫ్రెంచ్‌ గయానాలో ని కౌరులో ఉన్నా ఏరియాన్‌-5(విఎ247) ప్రయోగవేదిక నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు. జిశాట్‌-31ను విశాట్‌ నెట్‌వర్క్‌ , టెలివిజన్‌ అప్‌లింక్స్‌, డిజిటల్‌ శాటిలైట్‌ న్యూస్‌ సేకరణ, డిటిహెచ్‌ టెలివిజన్‌ సేవలు, సెల్యూలర్‌ బ్యాక్‌ హాల్‌ కనెక్టివిటీ, ఇతరములకు మద్దతుగా ఉపయోగించడం జరుగుతుందని ఇస్రో పేర్కొం ది. ఈ విస్తృతంగా బీమ్‌ కవరేజి సదుపాయాన్ని కూడా అందించనుందని సమాచారం.

DO YOU LIKE THIS ARTICLE?