5,34,903 మంది విద్యార్థులు పాస్‌

‘పదవ’ తరగతి విద్యార్థులకు గ్రేడ్‌లు ఖరారు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ పదవ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్లను కేటాయించింది. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కు ల ప్రాతిపదికన గ్రేడ్‌లను నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు నమోదు చేసుకున్న 5,34,903 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు మంత్రి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. “www.bse.telangana. gov.in” వెబ్‌సైట్‌లో గ్రేడ్లను అందుబాటులో పెట్టారు. మెమోలను వారి వారి పాఠశాలల్లో తీసుకోవాలని, పొరపాట్లు ఏమైనా ఉంటే పాఠశాల ప్రధానోప్యాయుల ద్వారా ఎస్‌ఎస్‌సి బోర్డుకు పంపిస్తే వాటిని సవరిస్తామని మంత్రి తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులందరినీ ప్రమోట్‌ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేశారు. విద్యార్థులు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తమ శక్తి, సామర్థ్యాలు, అభిరుచులకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవాలని, తద్వారా భవిష్యత్‌ బంగారమయం కావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?