5న రాష్ట్ర క్యాబినెట్‌

ప్రజాపక్షం/ హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మే 5వ తేదీ మధ్యాహ్నం ప్రగతిభవన్‌ లో జరగనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున దీనికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ఇది వరకే కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు, వలస కార్మికులకు వెళ్లేందుక అనుమతి వంటి నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.

DO YOU LIKE THIS ARTICLE?