45 పరుగులకే కుప్పకూలిన విండీస్‌

సెయింట్‌ కిట్స్‌: ఇంగ్లాండ్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డన్‌ (4/6) విజృంభించడంతో భారీ లక్ష్యంతో దిగిన వెస్టిండీస్‌ జట్టు 45 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇంగ్లాండ్‌కు 137 పరుగుల ఘన విజ యం లభించింది. మరోవైపు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2 సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఆఖరి టి20 ఆదివారం జరగనుంది. ఎందరో స్టార్‌ హిట్టర్లు ఉన్న విండీస్‌ టి20ల్లో ఇలా తేలిపోవడం విచిత్రంగా ఉంది. తమ సొంత గడ్డపై విండీస్‌ వరుసగా రెండు టి20ల్లో ఘో రంగా ఓటమిపాలవడం అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఇక బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమిష్టిగా రాణించిన ఇంగ్లాండ్‌ మరో గొప్ప విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్‌ నిర్ధేశించిన 183 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన విండీస్‌కు ఇంగ్లాండ్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డన్‌ హడలెత్తించాడు. నిప్పులు చెరిగే బంతులతో వారికి విరుచుకుపడ్డాడు. జోర్డన్‌ ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్న వెస్టిండీస్‌ జట్టు.. ఏ దశలోనూ విజయం దిశగా అడుగులు వేయలేకపోయింది. జట్టు స్కోరు 12 వద్ద విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రీస్‌ గేల్‌ (5)ను.. ఆ తర్వాత ఒక పరుగు వ్యవధిలోనే షై హోప్‌ (7)ను విల్లె పెవిలియన్‌ పంపాడు. తర్వాత హెట్మేయర్‌ (10), డారెన్‌ బ్రావో (0), జేసన్‌ హోల్డర్‌ (0), నికోలస్‌ (1), పాభియన్‌ (1), బ్రాత్‌వైట్‌ (10) వరుసగా పెవిలియన్‌కి క్యూ కట్టారు. దీంతో కరీబియన్‌ జట్టు కేవలం 11.5 ఓవర్లలోనే 45 పరుగులకి ఆలౌటైంది. జోర్డన్‌ 6 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి విజయంలో ముఖ్య భూమిక వహించాడు. ఇతర బౌలర్లలో డేవిడ్‌ విల్లె, అదిల్‌ రషీద్‌, ఫ్లంకెట్‌ తలో రెండ్లు వికెట్లు తీశారు. అంతుకుముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌లో సామ్‌ బిల్లింగ్స్‌ (87; 47 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), జోయ్‌ రూట్‌ (55, 40 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్‌ బౌలర్లలో అలెన్‌కి రెండు, కాట్రెల్‌, బ్రాత్‌వైట్‌, మాక్‌కాయ్‌కి తలోక వికెట్‌ దక్కింది.

DO YOU LIKE THIS ARTICLE?