21 మంది ఎంపిల సస్పెన్షన్‌

జంతర్‌మంతర్‌ వద్ద ఎపి పక్షాల ఆందోళన

పోలీసుల లాఠీచార్జి

కావేరిపై ఎఐఎడిఎంకె, ప్రత్యేక హోదాపై టిడిపి ఎంపిల ఆందోళన
లోక్‌సభలో గందరగోళం

న్యూఢిల్లీ: లోక్‌సభలో గురువారం ఎఐఎడిఎంకె, టిడిపి గందరగోళం సృష్టించడంతో సభ మరునాటికి వాయిదాపడింది. సభకు పదేపదే అంతరా యం కల్గించడంతో 21 మంది ఎంపిలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సస్పెండ్‌ చేశారు. సభ కార్యక్రమాలు సజావుగా సాగకుండా అడ్డుపడిన 13 మంది తెలుగుదేశం పార్టీ ఎంపిలను, ఏడుగురు ఎఐఎడిఎంకె ఎంపిలను ఆమె సస్పెండ్‌ చేశారు. 24 ఎఐఎడిఎంకె సభ్యులను సస్పెండ్‌ చేసిన మరునాడు కూడా వారు అలాగే ప్రవర్తించడంతో వారిని సస్పెండ్‌ చేశారు. లోక్‌సభ గురువారం సమావేశం కాగానే ఎఐఎడిఎంకె, టిడిపి సభ్యులు సభ వెల్‌లోకి దూసుకెళ్లారు. కావేరి నదిపై డ్యామ్‌ నిర్మాణాన్ని ఆపేయాలంటూ ఎఐడిఎంకె సభ్యులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. ఎఐఎడిఎంకె సభ్యులు అనేకసార్లు స్పీకర్‌వైపు పేపర్లు విసిరేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరేంద్ర సింగ్‌ తోమ ర్‌ ఎంపిలను వారి సీట్లలో కూర్చోవాలని అభ్యర్థించారు. ఆయన వినతిని పెడచెవిన పెట్టిన ఆ రెండు పార్టీల ఎంపిలు తమ నిరసనను కొనసాగించారు.
ఈ సందర్భంగా స్పీకర్‌ వారిని హెచ్చరించారు.

DO YOU LIKE THIS ARTICLE?