పేదలకు అవతార్ ట్రస్ట్ ఉచిత ఆహారం

ప్ర‌జాప‌క్షం/హైద‌రాబాద్ : అవతార్ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచితంగా అందిస్తున్న ఆహారం నాణ్యతను జి హెచ్ ఎం సి డిప్యూటీ మేయర్ మహమ్మద్ ఫసియుద్దీన్ తనిఖీ చేశారు. ఈ సమయంలో విద్యార్థులు, పేదలు, వృద్దులు, అనాధలకు ప్రతి రోజు రెండువేల భోజనములను అందిస్తున్న ట్రస్ట్ చైర్మన్ కే వి ప్రసాద్ గుప్తా, ఇతర సహచరులను అభినందించారు. వైవిధ్యంగా వెజ్ బిర్యానీ, వెజ్ పులవు, లెమెన్ రైస్, టమాటో రైస్, పెరుగన్నం, జీరా రైస్ ను ట్రస్ట్ వివిధ ప్రాంతాలలో తిరిగి పంపిణీ చేస్తున్నది.

DO YOU LIKE THIS ARTICLE?