2 నెలలు ఇంతే!

కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి
రాష్ట్ర అధికారులకు కేంద్ర బృందం సూచన
ప్రజాపక్షం/హైదరాబాద్‌ ; తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కరోనా కట్టడి చర్యలు, కొవిడ్‌ ఆస్పత్రుల పనితీరును కేంద్ర ప్రభుత్వ బృందం సోమవారం పరిశీలించింది. సంజయ్‌జాజు, డాక్టర్‌ రవీంద్రన్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో పలు ప్రాంతా ల్లో పర్యటించింది. ఈ సందర్బంగా కొవిడ్‌- ప్రత్యేక టిమ్స్‌, గాంధీ ఆస్పత్రులను సందర్శించి అక్కడి పరిస్థితిని ఆరా తీసింది. కరోనా వైరస్‌ రోగులకు అందిస్తున్న సేవలను, సౌకర్యాలను వైద్యులను అడిగి తెలుసుకున్నది. అలాగే దోమల్‌గూడలోని కంటైన్‌మెంట్‌ ప్రాంతాన్ని కూడా పరిశీలించింది. అంతకు ముందు బిఆర్‌కె భవన్‌లోని తాత్కాలిక సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, వైద్యశాఖ ఉన్నతాధికారులో కేంద్ర బృందం చర్చించింది. కరోనా కట్టడికి తీసుకుంటున్నచర్యలను రాష్ట్ర వైద్య అధికారులు కేంద్ర బృందానికి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. రాష్ట్రంలో సర్వైలెన్స్‌, కంటైన్‌మెంట్‌ చర్యలు, ఆసుపత్రుల సన్నద్ధత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరెస్‌ నివారణ చర్యలపై కేంద్ర ప్రతినిధి బృందానికి వివరించారు. రాష్ట్రంలో 17081 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని, మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్‌ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు రూ.475.74 కోట్లు మంజూరు చేసినట్టు వివరించింది. కాగ కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిందని సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు, వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్ర బృందం పలు సూచనలు చేసిందన్నారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలలో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్న కేం ద్ర బృందం సూచన మేరకు సోమేశ్‌ కుమార్‌ రాష్ట్ర అధికారులను అదేశించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌, కేంద్ర బృంద స భ్యులు సంజయ్‌జాజు, డాక్టర్‌ రవీంద్రన్‌, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ యోగితా రాణా, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమ య్‌ కుమార్‌, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?