17 కొత్త కేసులు

ఒకరు మృతి, 29కి చేరిన మృతుల సంఖ్య
1061కి చేరిన బాధితులు

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్తగా శనివారం 17 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 1061కి చేరింది. కొత్తగా జిహెచ్‌ఎంసి పరిధిలో 15, రంగారెడ్డి జిల్లాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి వల్ల మరొకరు మృతి చెందగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 29 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే 35 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 499కి చేరింది. ప్రస్తుతం 533 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం డిశ్చార్జి అయిన వారిలో హైదరాబాద్‌లో 24 మంది, సూర్యాపేటలో నలుగురు, వికారాబాద్‌లో నలుగురు ఆసిఫాబాద్‌లో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు, ఖమ్మంలో ఒకరకు ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?