16 నుంచి ఒంటిపూట బడులు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నా యి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చిత్రా రామచంద్రన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలకు ఇది వర్తిస్తుందన్నారు. ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 గం టల నుంచి మధ్యాహ్నం 12.30 గం టల వరకు పనిచేస్తాయి. 12.30 గం టలకు మధ్యాహ్న భోజనం అనంత రం విద్యార్థులను ఇంటికి పంపించనున్నారు. ఒంటి పూట బడులు చివరి పనిదినం ఏప్రిల్‌ 23 వరకు కొనసాగుతాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు జూన్‌ 12న తిరిగి ప్రా రంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీటిని విద్యాసంస్థలన్నీ అమలు చేసే లా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?