అర్ధ శతకంతో చెలరేగిన సూర్యకుమార్‌
ధోనీ, రాయుడుల శ్రమ వృథా
తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో చెన్నై ఓటమి
చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌లో తొలి ప్లేఆఫ్‌ సమరంలో ముంబయి ఇండియన్స్‌ విజ యం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది. చెపాక్‌ వేదిక సాగిన ఈ మ్యాచ్‌లో ముంబయి ఓపెనర్లు రోహిత్‌ శర్మ(4), డికాక్‌(8)లు నిరాశ పర్చగా ఆతరువాత సెకండ్‌ డౌన్‌లో వచ్చి సూర్యకుమార్‌((71; 54 బంతుల్లో 10×4, 1×0),ఇషాన్‌ కిషన్‌(28; 31 బంతుల్లో 1×4, 1×6)లు రాణించడంతో 10 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకొని ఫైనల్లో అడుగు పెట్టింది. చెన్నై బౌలర్లలో ఇ మ్రాన్‌ తాహీర్‌ 2 వికెట్టు తీసుకోగా, హర్భజన్‌సింగ్‌, దీపక్‌ చహార్‌ చెరో వికెట్టు పడగొట్టారు. అంతకుముందు టాస్‌ గెలిచిన చెన్నై టాప్‌ ఆర్డర్‌ విఫలమవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అంబటి రాయుడు టాప్‌ స్కోరర్‌ (42; 37 బంతుల్లో 3×4, 1×6)గా నిలవగా ధోనీ(37; 29 బంతుల్లో 3×6) అతడికి సహకరించాడు. వీరిద్దరూ 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో చెన్నై ఆ మాత్రం స్కోర్‌ సాధించింది. తొలుత 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుని మురళీవిజయ్‌(26; 26 బంతుల్లో 3×4), అంబటి రాయుడు ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే 12వ ఓవర్‌లో జట్టు స్కోర్‌ 65 పరుగుల వద్ద విజయ్‌ ఔటవ్వగా ధోనీ క్రీజులోకి వచ్చా డు. రాయుడితో కలిసి ధోనీ దూకుడుగా ఆడి చెన్నై స్కోరును 130 పరుగులు దాటించాడు. ముంబయి బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ రెండు వికెట్లు తీయగా కృనాల్‌పాండ్య, జయంత్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు.

DO YOU LIKE THIS ARTICLE?