1071కి చేరిన భార‌త క‌రోనా కేసులు

న్యూఢిల్లీ : కరోనా వైరస్ భారత్ నూ వ‌ణికిస్తోంది. కేసులు వెయ్యి దాటాయి. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1071కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో 29మంది మరణించగా 942మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 100మంది కొవిడ్ -19నుంచి కోలుకున్నారని తెలిపింది. మహారాష్ట్రలో కొవిడ్ -19 తీవ్రత అధికంగా ఉంది. తాజాగా ఇక్కడ మృతుల సంఖ్య 8కు చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో 218కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 25మంది కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కేరళలో 213కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒకరు మరణించారు. గుజరాత్ లో కొవిడ్ -19 మృతుల సంఖ్య ఐదుకు చేరింది. కర్ణాటకలో ఈ కేసుల సంఖ్య 85కి చేరగా ముగ్గురు మరణించారు. దిల్లీ, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్ లో కొవిడ్ 19 కారణంగా ఇద్దరు మరణించారు. బిహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్లో ఒకరుచొప్పున మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకు 70కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసుల సంఖ్య 21 చేరినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

DO YOU LIKE THIS ARTICLE?