10 జనపథ్‌లో చంద్రబాబు

తొలిసారి సోనియాతో ఎపి సిఎం భేటీ
ఫలితాలు, వ్యూహాలపై కీలక చర్చ
వైఎస్‌ జగన్‌, కెసిఆర్‌ అంశం ప్రస్తావన?
ఎన్‌డిఎయేతర పక్షాలను ఏకం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు

ప్రజాపక్షం / హైదరాబాద్‌; ఈ నెల 23వ తేదీన ఫలితాలు వెలువడిన అనంతరం చోటు చేసుకునే రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ సారథ్యం వహిస్తోన్న యూపిఎ మిత్రపక్షాలతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు ఎడతెగని చర్చలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చంద్రబాబు తొలిసారిగా యూపిఎ ఛైర్‌ పర్సన్‌ సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సోనియాగాంధీ నివాసం 10 జనపథ్‌లో వారిద్దరు సుమారు 40 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. ఎన్నికల అనంతరం ఫలితాలు, పరిణామాలపై వారు చర్చి ంచారు. కాగా ఫలితాలకు ముందే ఎన్డీయేతర పక్షాలను ఏకం చేసేందుకు చంద్రబాబు నాయు డు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు ఆదివారం ఉదయం మరోసారి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఎన్‌సిపి అధ్యక్షులు శరద్‌ పవార్‌తో సమావేశం అయ్యారు. శనివారం మాయావతి,అఖిలేష్‌ యాదవ్‌తో జరిగిన భేటీ అంశాలను చంద్రబాబు వారికి వివరించారు. ఆదివారంతో తుది దశ పోలింగ్‌ ముగియనుండడంతో తదుపరి కార్యాచరణపై వారితో చర్చించా రు. ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చిన తర్వాత ఎలా ముందుకు వెళ్లాలన్నఅంశంపై కూడా వారు చర్చలు జరిపారు. ఎన్నికల ఫలితాల ముందు ఎలా వ్యవహరించాలి, ఎన్నికల ఫలితాల తర్వాత ఎలా ముం దుకు వెళ్లాలన్నదానిపై చంద్రబాబు, రాహుల్‌, శరద్‌ పవర్‌ వ్యూహ రచన చేసినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఎన్డీయేతర కూటమి నేతలంతా ఒకసారి సమావేశం అయితే బాగుంటుందని అభిప్రాయపడినట్లు సమాచా రం. రెండు రోజుల వ్యవవధిలో రాహుల్‌తో చంద్రబాబు రెండుసార్లు భేటీ కావడం ద్వారా చంద్రబాబుకు కాంగ్రెస్‌ అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టమవుతోంది. బిజెపియేతర పక్షాలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చే బాధ్యతను చంద్రబాబు తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉండగా, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరితో వేరుగా భేటీ అయ్యారు. విపక్ష పార్టీలు కలిసి వచ్చే అంశంపై చర్చించారు.

DO YOU LIKE THIS ARTICLE?