HomeNewsసిరిసిల్ల జిల్లా వార్త‌లు (30-03-2020)

సిరిసిల్ల జిల్లా వార్త‌లు (30-03-2020)

ఇంటి వద్దకే ఔషధాలు : జిల్లా ఔషధ నియంత్రణ అధికారి శ్రీ అశ్విన్ కుమార్

ప్ర‌జాప‌క్షం/సిరిసిల్ల : అత్యవసర సమయంలో ఔషధాలు (మందులు) అవసరమైన వారికి తమ ఇంటివద్దకే పంపించేందుకు ఔషధ శాఖ ఏర్పాట్లు చేసిందని జిల్లా ఔషధ నియంత్రణ అధికారి శ్రీ అశ్విన్ కుమార్ పేర్కొన్నారు.
అత్యవసరంగా మందులు కావలసినవారు డాక్టర్ రాసినటువంటి చిట్టి (ప్రిస్క్రిప్షన్) ను ఫోటో తీసి వాట్సప్ నెంబర్ కు వారి ఇంటి చిరునామా వివరాలు తెలిపితే ఆ వ్యక్తి తమ ఇంటికి వచ్చి మందులను తీసుకువచ్చి అందజేస్తారని ఆయన తెలిపారు. ప్రజలు కరోనా వ్యాధి బారిన పడకుండా, సామాజిక దూరం పాటించడానికి ఈ ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అత్యవసర సమయంలో మందులు కావాల్సిన వారు ఈ క్రింద పేర్కొన్న నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

ప్రముఖ వైద్యులు డా. కందేపి ప్రసాద రావు దంపతుల ఉదారత..

కరోనా నియంత్రణ చర్యలకు రూ.ఒక లక్ష విరాళం

ప్ర‌జాప‌క్షం/సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ కందేపి ప్రసాదరావు ,వారి సతీమణి రాణి ప్రసాద్ తమ ఉదారత కనబరిచారు. కరోనా కష్ట కాలంలో జిల్లా యంత్రాంగానికి రూ.ఒక లక్ష విరాళం అందజేశారు. కరోనా వైరస్‌ సంక్రమణ అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం నియంత్రణ చర్యలకు పలువురు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా నెలకొన్న కష్టకాలంలో నియంత్రణ చర్యల కోసం, పేదలను ఆదుకోవడానికి  ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ కందేపి ప్రసాదరావు ,వారి సతీమణి రాణి ప్రసాద్ లు రూ.ఒక లక్ష విరాళం అందించారు. సోమవారం (మార్చి 30) కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ను కలిసి ఇందుకు సంబంధించిన చెక్కును అందజేశారు.

డా. కందేపి ప్రసాద రావు దంపతుల ఉదారతను కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ కొనియాడారు. సదుద్దేశంతో స్వచ్ఛందంగా వచ్చి విరాళాలను అందించడం హర్షణీయమన్నారు . వీరి ప్రత్యేక చొరవ ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు

ఈ సందర్భంగా డా. కందేపి ప్రసాద రావు మాట్లాడుతూ, కరోనా ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ప్రజలంతా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు సంపూర్ణ సహకారం అందించి… కరోనా మహమ్మారిని జిల్లా, రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు సహకారం అందించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కత్తెర వరుణ్ కుమార్ 10 వేల విరాళం
సిరిసిల్ల పట్టణానికి చెందిన వ్యాపారి కత్తెర వరుణ్ కుమార్ తన స్నేహితుడు మహమ్మద్ మునీర్ తో కలిసి కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు సహాయకారిగా ఉండేందుకు వీలుగా రూ 10 వేల ఆర్థిక సహాయాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు కలెక్టరేట్లో అందించారు.కరోనా బారిన పడకుండా ఉండేందుకు వీలుగా జిల్లా ప్రజలు ప్రభుత్వం సూచించిన ముందస్తు జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలన్నారు. విరాళం అందించిన కత్తెర వరుణ్ కుమార్ ను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అభినందించారు.

రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం : కలెక్టర్

ఏప్రిల్‌ 7 వరకు క్వారంటైన్‌లో ఉన్న వారు బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యతను స్థానిక ప్రజలు తీసుకోవాలి

ప్ర‌జాప‌క్షం/సిరిసిల్ల : జిల్లాలో రైతులు తమ పొలంలో పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు.

సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మీటింగ్ హాల్లో కరోనా వైరస్ నువ్వు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు , మొక్కజొన్న , ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వపరంగా చేస్తున్న ఏర్పాట్లను వివరించేందుకు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ , ఎస్పి శ్రీ రాహుల్ హెగ్డే తో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కరోనా నేపథ్యంలో రైతులకు టోకెన్లు జారీ చేసి విడతల వారీగా గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు చేస్తా మన్నా రు. రైతులంతా క్రమశిక్షణతో జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. ఒకేరోజు అందరి ధాన్యం కొనుగోలు సాధ్యం కాదనీ పేర్కొన్నారు. అందువల్ల టోకెన్‌పై ఉన్న తేదీ ప్రకారమే రైతులు ధాన్యం అమ్మకానికి రావాల్సి ఉంటుందనీ కలెక్టర్ అన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా లో మొత్తం 13 మండలాలలో 1,32,992 ఎకరాలలో రబీ 2019-20 కాలానికి వరి పంటని పండించడం జరిగింద న్నారు. ఈ సీజన్ లో మొత్తం 3,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యము కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నామ న్నారు. గత రబీ 2018-19 కాలం లో IKP-56, PACS-117 మొత్తం 173 సెంటర్ల ద్వారా 1 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యము ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింద న్నారు. ప్రస్తుత రబీ 2019-2020 కాలానికి , IKP-85, PACS-125, MEPMA-2, DCMS-3, మొత్తం 215 సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించా మన్నా రు.

జిల్లా లో వరి కోతలన్నియు రైతులు నియంత్రిత పద్దతి లో చేయాలని కోరామన్నారు. జిల్లా లోని వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs), గ్రామ రెవిన్యూ అధికారులు(VROs), మండల వ్యవసాయ అధికారులు (MAOs), మండల తహసిల్దార్లు (MROs),గ్రామ, మండల, రైతు బంధు సభ్యులు, కోఆర్డినేటర్లు అందరూ సమన్వయముతో ఆయా గ్రామాలలోని రైతులకు టోకెన్లు జారీ చేసి, దాని ప్రకారం రైతులు వరి ధాన్యం కోసి, సెంటర్లకు తీసుకు రావాల్సి ఉంటుంద న్నారు. జిల్లా లోని వ్యవసాయ అధికారులు, హర్వేస్టర్లు ( వరి కోత యంత్రాలు ) సిద్దం చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం జిల్లా లో 141 హర్వేస్టర్లు( వరి కోత యంత్రాలు ) అందుబాటులో ఉన్నాయి. మరిన్ని హర్వేస్టర్లను ( వరి కోత యంత్రాలను ) ఇతర జిల్లాల లేదా ఇతర రాష్ట్రాల నుండి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రైతులందరూ ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా ఉండవలసినదిగా కోరడంతో పాటు ప్రతి ధాన్యం గింజను ప్ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలియజేస్తున్నాము. రైసు మిల్లర్ యజమానులు , మధ్యవర్తులు కూడా వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధర రైతులకు చెల్లించి రైతుల దగ్గర కొనుగోలు చేయవచ్చు నీ అన్నారు.
వ్యవసాయ మార్కెట్ యార్డులలోకి రైతులు ధాన్యం తీసుకురాకూడదన్నారు. మార్కెట్ యార్డులలో ధాన్యం కొనుగోలును పూర్తిగా నిలిపి వేయడం జరిగిం దన్నారు.

అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పూర్తి వసతులు కల్పించడంతో పాటు, సానిటేషన్ చేయించవలెను. కొనుగోలు కేంద్రాలలో, అందరూ సామాజిక దూరం పాటించవలెను , ఇందుకు గాను పోలిస్ శాఖ వారిని తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరడమైనది. ఎట్టి పరిస్థితులలో, సంబంధిత రైతులు , హమాలీలు, ట్రాన్స్ పోర్ట్ వ్యక్తులు , కొనుగోలు కేంద్రాలలో పని చేసే సిబ్బంది మినహా ఇతరులు కొనుగోలు కేంద్రాలలోకి అనుమతించబడరు.ధాన్యం కొనుగోలు కేంద్రాలలోకి అవసరమైన హమాలీలను స్థానిక గ్రామాల నుండి సమకూర్చుకోవలసి ఉంటుంది. కొనుగోలు కేంద్రం నుండి రైసు మిల్లులకు ధాన్యం రవాణాకు అదనపు లారీలు సమ కూర్చుకోవలసిందిగా ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేయడమైనది . రైసుమిల్లులో కూడా హమాలీలను త్వరగా సమకూర్చుకొని వచ్చిన ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవలసిందిగా కోరడమైనది.
తదుపరి నిత్యావసర వస్తువుల విషయంలో ఏమైనా కొరత గానీ , అధిక ధరలకు అమ్మినా గానీ, కంట్రోల్ రూమ్ నెం . 630914 1122, 08723- 231166 కి ఫిర్యాదు చేయవచ్చు. అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోబడును.

వలస కార్మికులకు అన్నివిధాలుగా జిల్లా యంత్రాంగం అండగా ఉంటుంది.

జిల్లాలో వలస కార్మికుల సంఖ్యను గుర్తించేందుకు సర్వే చేయించగా 4998 మంది ఇటుక బట్టీలు, నిర్మాణరంగం ,ఇరిగేషన్ ప్రాజెక్టుల లో పని చేస్తున్నట్టు తేలిందన్నారు. వీరిలో పలువురు భోజనం వండి ఇవ్వాల్సిందిగా, పలువురు రేషన్ ఇవ్వాల్సిందిగా, మరి కొంతమంది షెల్టర్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారని కలెక్టర్ తెలిపారు. వారు కోరిన విధంగా భోజనం అందించడం, రేషన్ జిల్లా యంత్రాంగం ఇస్తుందన్నారు. అలాగే వలస కార్మికులకు జిల్లా యంత్రాంగం షెల్టర్ సౌకర్యం కల్పిస్తుo దన్నారు. డయాబెటిస్, బిపి ,తదితర ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే కార్మికులకు అవసరమైన మందులను, వైద్య సేవలను ఉచితంగా అంది స్తమన్నారు. జిల్లాలో బువ్వ లేకుండా పస్తులు ఉండే పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతూ … వలస కార్మికులకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఉచిత భోజనం

అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ క్యాంటీన్ ల ద్వారా రూ. 5 రూపాయలకే భోజన సౌకర్యం కల్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
కరోనా నేపథ్యంలో సకలం బంద్ అయిన నేపథ్యంలో అన్నపూర్ణ క్యాంటీన్ ల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పట్టణాలలోని వీధుల్లో ఉండే అభాగ్యులకు స్వయంగా వెళ్లి భోజనము అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిరు పేద ప్రజలు అన్నపూర్ణ క్యాంటీన్ ల ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

క్వారంటైన్‌లో ఉన్న వారు బయటకు రాకుండా చూడాలి

జిల్లాలో క్వారంటైన్‌లో 1032 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు వీరందరి పాస్పోర్ట్ లను ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి పాస్ పోర్ట్ లను రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. కరోనా వ్యాధి లక్షణాలు బయ ట పడే వ్యవధి రెండు రోజుల నుంచి 14 రోజుల వరకు ఉంటుంది అన్నారు. విదేశాల నుంచి మన జిల్లాకు వచ్చిన చివరి వ్యక్తి మార్చి 22వ తేదీన వచ్చాడని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో క్వారంటైన్‌లో ఉన్న 1032 మందినీ ఏప్రిల్ 7వ తేదీ దాకా బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజలు దేని కలెక్టర్ పేర్కొన్నారు . దక్షిణ కొరియా దేశం లో కరోనా వ్యాధి సోకిన ఒక వ్యక్తి , అదేశంలోని 59 వేల మందికి కరోనా వ్యాధి సోకేలా చేశారని కలెక్టర్ తెలిపారు. నిర్లక్ష్యంగా ఉంటే మన దేశం మన రాష్ట్రం, జిల్లా కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందన్నారు.
జిల్లాలో ఇంకా 673 మంది స్వీయ గృహ నిర్భంధం పూర్తి చేయాల్సి ఉందన్నారు. వీరందరూ తప్పకుండా పూర్తి కాలం పాటిం చే లా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర గ్రామాల నుంచి తమ గ్రామంకు వచ్చే వ్యక్తులను కూడా గ్రామ ప్రజలు స్వీయ గృహ నిర్భంధం లో ఉంచేలా చూడాలన్నారు.
కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఉన్నంతకాలం స్వీయనిర్భందంలో ఉండాలని కోరారు.

నిత్యవసర వస్తువుల సరఫరా సాఫీగా జరిగేలా చూస్తాం

జిల్లాలో నిత్యావసర వస్తువుల సరఫరా సాఫీగా జరిగేలా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువుల రేట్లు నియంత్రణలో ఉన్నాయన్నారు. కూరగాయలు పండ్లు పండించే రైతులు వాటి రవాణాలో ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే జిల్లా వ్యవసాయ అధికారి నీ 9 8 4 9 4 3 5 5 2 7 , 7 2 8 8 8 9 4 1 3 7 , జిల్లా ఉద్యాన అధికారి నీ 7 9 9 7 7 2 5 0 7 6 నెంబర్లో సంప్రదించాలని కలెక్టర్ ప్రజలకు రైతులకు సూచించారు. లేదంటే కలెక్టరేట్ లో ఉన్న కంట్రోల్ రూమ్ నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. స్థానిక వ్యవసాయ ఉద్యానవన అధికారులు కూడా సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు.

జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతుందన్నారు .
క్వారం టైన్ లో ఉన్న వారిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని ఎస్పి తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి బయట తిరిగితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు . అంతేకాకుండా వారి పాస్పోర్టు రద్దు చేయాల్సిందిగా రీజినల్ పాస్పోర్ట్ ఆఫీస్ అధికారికి లేఖలు రాస్తామని అన్నారు. వలస కార్మికులు ఉంటున్న ప్రదేశాలను ఇప్పటికే పోలీసు అధికారులు సందర్శించారని ఎస్పీ తెలిపారు . వలస కార్మికులకు వారి యజమానులు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది అన్నారు. ఏదేని కారణాలతో యజమానులు వారికి మౌలిక సదుపాయాలు కల్పనలో విఫలమైతే జిల్లా యంత్రాంగం వారికి కావలసిన మౌలిక వసతులు సమకూర్చుతుందని ఎస్పీ తెలిపారు. అలాగే జిల్లాలోని నిత్యవసర వస్తువులు కొరత లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని ఎస్పీ పేర్కొన్నారు. నిత్యవసర వస్తువులను బ్లాక్ మార్కెటింగ్ చేసిన, నిల్వచేసిన ,ఎక్కువ ధరలకు అమ్మిన బాధ్యులపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ధాన్యం పంటను కోసేందుకు అవసరమైన వరి కోత మిషన్ యంత్రాలు ఫ్రీ మూమెంట్ ఉండేలా చూస్తున్నామన్నారు .హార్వెస్టర్ కు అవసరమైన మరమ్మతులు చేపట్టి షాపులను ఓపెన్ చేసేలా చూస్తామన్నారు .ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంప్రదించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. లేదంటే డయల్ 100, కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయవచ్చునని ఎస్పీ తెలిపారు. లాక్ సమయంలో జిల్లా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పాత్రికేయుల సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ అంజయ్య శిక్షణ కలెక్టర్ శ్రీ సత్య ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ,జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్, జిల్లా ఉద్యానవన అధికారి శ్రీ వెంకటేశ్వర్లు, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీ షాబో ద్దిన్, మున్సిపల్ కమిషనర్ శ్రీ సమ్మయ్య, జిల్లా పౌరసంబంధాల అధికారి దశరథం తదితరులు పాల్గొన్నారు.

వలస కార్మికులకు రేషన్,ఆర్థిక సహాయం అందజేత

ప్ర‌జాప‌క్షం/సిరిసిల్ల : బోయినిపల్లి మండలం స్తంభం పల్లి గ్రామంలోని 10 మంది వలస కార్మికులకు జిల్లా యంత్రాంగం అండగా నిలిచింది

బీహారు కు చెందిన 10 మంది కార్మికులు  గుండన్న పల్లి లోని జిన్నింగ్ మిల్లులో కొంతకాలంగా పనిచేస్తున్నారు.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సదరు యజమాని జిన్నింగ్ మిల్లును మూసివేశారు. మిల్లు మూసివేత తో ఉపాధి కోల్పోయిన కార్మికులు రోడ్డున పడ్డారు.  తినేందుకు తిండి గింజలు దొరకడం కష్టం అయ్యింది. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే కలెక్టర్ క్షేత్ర అధికారులను అప్రమత్తం చేశారు.

కలెక్టర్ ఆదేశాలు అందుకున్న అధికారులు స్థానిక తహశీల్దార్ ప్రసాద్ నేతృత్వంలో అధికారులు
స్తంభం పల్లి సందర్శించారు. కార్మికుల కష్టాల ను అడిగి తెలుసుకున్నారు.

10 మంది కార్మికులు కు ఒక్కో వ్యక్తికి 12 కిలోల చొప్పున 120 కిలోల బియ్యం అందజేశారు. అలాగే ఒక్కో వ్యక్తికి 500 చొప్పున 5 వేల రూపాయలు అందించారు.

లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద కార్మిక కుటుంబాలకు జిల్లా యంత్రాంగం అన్నీ విధాలుగా అండగా ఉంటామని కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో తమ పరిస్థితి ని అర్థం చేసుకొని రేషన్ తో పాటు ఆర్థిక సహాయం అందజేసిన అధికారులకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.

మూఢ పల్లి లో కార్మికులకు ఉచిత రేషన్ అందజేత
చందుర్తి మండలం మూఢపల్లి గ్రామంలోని వలస కార్మికులకు స్థానిక రెవెన్యూ అధికారులు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందజేశారు.

వలస కార్మికులకు బియ్యం పంపిణీ

ప్రజాపక్షం/రుద్రంగి : రుద్రంగి మండల కేంద్రంలో ఉపాధి నిమిత్తం వలస వచ్చిన కార్మికులకు సోమవారం జెడ్పిటిసి గట్ల మీనయ్య,సర్పంచ్ తర్రె ప్రబలత మనోహర్,ఎస్ఐ వెంకటేశ్వర్లు, చేతుల మీదుగా 12 కిలోల బియ్యం మరియు 500 రూపాయల నగదు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారికి వలస వచ్చిన కార్మికులకు ప్రభుత్వం అండగా నిలిచిందని కరోనా వైరస్ ప్రభావంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పనులు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు 12 కిలోల బియ్యం మరియు 500 రూపాయలను ప్రతి వలస కార్మిక కుటుంబానికి పంపిణీ చేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్, సంజీవ్,రాజేశం,గణేష్,గంగాధర్, డీలర్ భాస్కర్, తదితరులు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments