హైకోర్టు తాత్కాలిక సిజెగా రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌

ప్రజాపక్షం / హైదరాబాద్‌ లీగల్‌  : తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తిగా జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఉమ్మడి హైకోర్టు విభజన తర్వాత తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ టిబిఎన్‌ రాధాకృష్ణన్‌ను కోల్‌కత్తా హైకోర్టుకు బదిలీ చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు వెలువడిన విషయం విదితమే. ఆయన కోల్‌కత్తా సిజెగా వచ్చే మంగళవారం ప్రమాణ స్వీ కారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 6వ తేదీలోగా కోల్‌కత్తా సిజెగా బాధ్యతలు స్వీకరించాలని కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక్కడ రిలీవ్‌ అయిన వెంటనే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చౌహాన్‌ బాధ్యతలు స్వీరిస్తారని కేంద్రన్యాయ శాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 1959 డిసెంబర్‌ 24న పుట్టిన జస్టిస్‌ చౌహాన్‌ 1980లో అమెరికాలో ఆర్కాడియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. 1983లో ఢిల్లీ వర్సిటీలో లా చేశారు. 2005లో రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా, 2015 నుంచి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా చేశారు. 2018 నవంబర్‌ 21 ఎపి, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు బదిలీ అయ్యారు. హైకోర్టు విభజన తరువాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. సీనియర్‌ న్యాయమూర్తి కావడంతో జస్టిస్‌ చౌహాన్‌ను తాత్కాలిక సిజెగా నియమితులయ్యారు

DO YOU LIKE THIS ARTICLE?