హాకీ ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లో భారత్‌ ఓటమి

భువనేశ్వర్‌ : సొంత గడ్డపై జరుగుతున్న పురుషుల హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌ ఓటమిని మూటగట్టుకుంది. లీగ్‌ దశ నుంచి ప్రతి మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆడుతూ క్వార్టర్‌ ఫైనల్లో చేరిన భారత హాకీ జట్టు నెదర్లాండ్‌ చేతి పరాజయం పాలైంది. హకీ ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ప్రవేశించాలని ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన భారత్‌కు నిరాశే మిగిల్చింది. 43 ఏళ్ల భారత ఆశలపై నీళ్లు చల్లింది నెదర్లాండ్‌. భువనేశ్వర్‌ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌లో 1 తేడాతో భారత్‌ పరాజయం పాలైంది. 12వ నిమిషంలోనే భారత్‌ తొలి గోల్‌ సాధించింది. ఆకాశ్‌దీప్‌సింగ్‌ అద్భుతమైన రివర్స్‌ ఫ్లిక్‌తో భారత్‌కు ఆధిక్యాన్ని అందించినా ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. 15వ నిమిషంలో నెదర్లాండ్స్‌ ఆటగాడు బ్రింక్‌మాన్‌ గోల్‌ చేసి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లూ చాలా సేపటి వరకు హోరాహోరీగా పోరాడగా 50వ నిమిషంలో నెదర్లాండ్‌ ఆటగాడు మింక్‌ వాండెర్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి తమ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆఆ తర్వాత ఎంత ప్రయత్నించినా భారత్‌కు గోల్‌ చేసే అవకాశం దక్కించుకోలేక ఓటమిని చవిచూసింది.

DO YOU LIKE THIS ARTICLE?