స్పెయిన్‌కు భారత్‌ షాక్‌

5 మ్యాచ్‌ విజయం, మహిళల హాకీ టోర్నీ
ముర్సియా (స్పెయిన్‌): భారత మహిళా హాకీ జట్టు స్పెయిన్‌ పర్యటనలో ఆకట్టుకొంటుంది. ఆతిథ్య స్పెయిన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు 5 ఘన విజయం సాధించారు. వరల్డ్‌కప్‌ కాంస్య పతక విజేత స్పెయిన్‌తో ఇక్కడ జరిగిన మూడో మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన భారత జట్టు సిరీస్‌ను 1 సమం చేసింది. తొలి మ్యాచ్‌లో 2 ఓటమిపాలైన టీమిండియా తర్వాత రెండో మ్యాచ్‌ను 1 డ్రా చేసుకుంది. ఇప్పుడు తాజా మ్యాచ్‌లో స్పెయిన్‌ను భారీ తేడాతో చిత్తు చేసి తమ సత్తా చాటుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ తరఫున మిజోరమ్‌ యువ క్రీడాకారిణి లాల్రెమ్‌సియామి 17వ నిమిషంలోనే గోల్‌ చేసి భారత్‌కు శుభారంభాన్ని అందించింది. తర్వాత (58వ) నిమిషంలో మరో గోల్‌ చేసి దూకుడును ప్రదర్శించింది. మరోవైపు నేహ గోయల్‌ (21వ), నవనీత్‌ కౌర్‌ (32వ), రాణి రాంపాల్‌ (51వ) నిమిషాల్లో గోల్స్‌ చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. స్పెయిన్‌ తరఫున బెర్టా బొనస్ట్రే(7వ), (35వ) నిమిషాల్లో రెండు గోల్స్‌ నమోదు చేసింది. ఆరంభంలో దూకుడును కనబర్చిన స్పెయిన్‌ తర్వాత భారత ఆటగాళ్ల జోరుముందు తేలిపోయారు. భారత ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్‌ పోస్టులపై వరుసదాడులు చేస్తూ హడలెత్తించారు. వీరి దాడిని స్పెయిన్‌ గోల్‌ కీపర్‌ అడ్డుకోలేకపోయింది. భారత యువ క్రీడాకారిణి లాల్రెమ్‌సియామి అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తూ రాణించింది. రెండు గోల్స్‌ కొట్టి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది.

DO YOU LIKE THIS ARTICLE?