సౌరభ్‌ చౌదరికి స్వర్ణం

వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన యువ ఆటగాడు
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌
ఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌లో భారత్‌ వరుసగా రెండో పసిడిని తన ఖాతాలో వేసుకుంది. షూ టింగ్‌ వరల్డ్‌ కప్‌ పోటీల తొలి రోజు భారత మహి ళా షూటర్‌ అపూర్వి చండేలా సరికొత్త ప్రపంచ రికార్డుతో స్వర్ణం సాధించగా.. తాజాగా ఆదివారం రెండో రోజు భారత యువ షూటర్‌ సౌర భ్‌ చౌదరి స్వర్ణ పతకం సాధించాడు. తొలిసారి సీనియర్‌ విభాగంలో షూటిం గ్‌ ప్రపంచకప్‌లో పాల్గొన్న 16 ఏళ్ల యువ ఆటగాడు సౌరభ్‌.. సరికొత్త వరల్డ్‌ రికార్డు స్కోరుతో స్వర్ణం గెలుచుకున్నాడు. 10 మీటర్‌ ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో సౌరభ్‌ చౌదరీ 245.0 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఫైనల్లో పొడియం పొజిషన్‌ సాధించిన సౌరభ్‌ కడవరకూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి సెర్బియాకు చెందిన స్టార్‌ షూటర్‌ దామిర్‌ మిక్పె వెనుక్కినెట్టి పసిడితో మెరిశాడు. ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సౌరభ్‌ కొట్టిన ప్రతీ షాట్‌ 10 పాయింట్ల కం టే ఎక్కువ ఉండటం విశేషం. ఫలితంగా సౌరభ్‌ చౌదరి 2020 టోక్యో ఒలింపిక్స్‌ బెర్తును ఖాయం చేసుకున్నాడు. గత ఏడాది జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లోనూ సౌరభ్‌ పసిడి గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా సీనియర్‌ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసిన సౌర భ్‌.. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ జూనియర్‌ విభాగంలో కూడా వరల్‌ రికార్డు అతని పేరిటే ఉండడం విశేషం. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వ రల్డ్‌కప్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి రోజు పోటీల్లో భారత మహిళా షూటర్‌ అపూర్వి చండేలా కొత్త ప్రపంచ రికార్డుతో పాటు స్వర్ణ పతకాన్ని కూడా సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్లో 26 ఏళ్ల అపూర్వి ఫైన ల్లో 252.9 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో అపూర్వి 252.4 పాయింట్లతో గత ఏడాది ఏప్రిల్లో చైనా షూటర్‌ రుజుజావో సాధించిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

DO YOU LIKE THIS ARTICLE?