సౌతాఫ్రికా జయకేతనం

మెరిసిన డుప్లెసిస్‌, తొలి వన్డేలో లంక ఓటమి
జొహన్నెస్‌బర్గ్‌: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 8 వికెట్లతో జయకేతనం ఎగరవేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 47 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. కుశాల్‌ మెండిస్‌ (60), ఒషాడా ఫెర్నాండో (49), ధనంజయ (39) పరుగులతో రాణించారు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగ్‌డీ, ఇమ్రాన్‌ తాహిర్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టుకు ఆరంభంలోనే హాండ్రిక్స్‌ రూపంలో షాక్‌ తగిలినా.. తర్వాత క్వాంట డికాక్‌ (81; 72 బంతుల్లో 11 ఫోర్ల)తో కలిసి కెప్టెన్‌ డుప్లెసిస్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కి 136 పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పర్చిన అనంతరం డికాక్‌ వెనుదిరిగాడు. తర్వాత వాన్‌ డర్‌ డుస్సెన్‌ (32 నాటౌట్‌)తో కలిసి డెప్లెసిస్‌ (112 నాటౌట్‌; 114 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ శతకంతో తమ జట్టును గెలిపించాడు. దీంతో సఫారీ జట్టు 38.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.

DO YOU LIKE THIS ARTICLE?