‘సైరా..’లో వీరారెడ్డి వ‌చ్చేశాడు

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం నుంచి మరో లుక్‌ బయటకు వచ్చింది. విల‌క్ష‌ణ‌ నటుడు జగపతిబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఆయన వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, తమన్నా పాత్రలకు సంబంధించిన లుక్స్‌ బయటకు వచ్చాయి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌ 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?