సైనా, సింధు శుభారంభం

శ్రీకాంత్‌కు షాక్‌, సమీర్‌ ముందంజ
ఆసియా ఛాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌
వుహన్‌: భారత మహిళా స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పివి సింధు ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశారు. మరోవైపు పురుషుల విభాగంలో స్టార్‌ ప్లేయర్‌ కిదాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్‌లోనే షాక్‌ తగిలింది. కాగా, సమీర్‌ వర్మ ముందంజ వేశాడు. ఇక డబుల్స్‌లో భారత్‌కు నిరాశే మిగిలింది. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ విభాగం తొలి రౌండ్‌లో ఒలింపిక్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌, నాలుగో సీడ్‌ పివి సింధు 21 21 తేడాతో జపాన్‌కు చెందిన తకహాశి సయకాను వరుస గేమ్‌లలో చిత్తు చేసి రెండో రౌండ్‌లో ప్రవేశించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ ఏడాది ఒక్క టైటిల్‌ కూడా గెలవని సింధు ఆసియా ఛాంపియన్‌షిప్‌ను నెగ్గి తన ఖాతాలో తొలి టైటిల్‌ వేసుకోవాలని భావిస్తోంది. జపాన్‌ క్రీడాకారిణితో జరిగిన మొదటి గేమ్‌లో సింధు వరుస స్మాష్‌లతో విజృంభించింది. ఒకొక్క పాయింట్‌ సాధిస్తూ మ్యాచ్‌లో పట్టు బిగించింది. అయితే మధ్యలో జపాన్‌ ప్లేయర్‌ కొద్దిగా పోరాడినా తర్వాత సింధు జోరు పెంచడంతో ఆమే మెత్తబడిపోయింది. ఆఖరికి సింధు ఈ గేమ్‌ను 21 తేడాతో గెలుచుకుంది. తర్వాత జరిగిన రెండో గేమ్‌లో మరింతగా చెలరేగి ఆడిన సింధు ప్రత్యర్థిపై విరుచుకుపడి వరుసగా పాయింట్లు చేస్తూ పోయింది. సింధు జోరుకు తట్టుకోలేక తకహాశి పూర్తిగా చేతులెత్తేసింది. దాంతో సింధు 21 భారీ తేడాతో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన సింధు 28 నిమిషాల్లోనే విజయం సాధించింది. ఇక రెండో రౌండ్‌లో సింధు ఇండోనేషియాకు చెందిన చౌరునిసాతో తలపడనుంది. మహిళల సింగిల్స్‌ మరో మ్యాచ్‌లో ఏడో సీడ్‌ సైనా నెహ్వాల్‌ 12 21 21 తేడాతో చైనా ప్లేయర్‌ హాన్‌ యూపై విజయం సాధించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. మ్యాచ్‌ను పేలవంగా ఆరంభించిన సైనా.. తర్వాత పుంజుకొని విజేతగా నిలిచింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థి జోరు ముందు తేలిపోయిన భారత స్టార్‌ సైనా.. తర్వాతి గేమ్‌లలో తేరకుంది. ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగి వరుసగా పాయింట్లు చేసుకుంటూ ముందుకు సాగింది. సైనా తొలి గేమ్‌ను భారీ తేడాతో కోల్పోయింది. అనంతరం రెండో గేమ్‌లో జోరును ప్రదర్శించి ఏకపక్షంగా గెలుపొందింది. ఇక మిగిలిన చివరిదైన నిర్ణయాత్మకమైన ఆఖరి గేమ్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఇద్దరూ చెరో పాయింట్‌ చేస్తూ ముందుకు సాగడంతో మ్యాచ్‌లో ఉత్కంఠత నెలకొంది. అయితే ఆఖర్లో సైనా తన అనుభవంను ఉపయోగిస్తూ మెరుగ్గా ఆడి 21 మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. ఇక తర్వాతి మ్యాచ్‌లో సైనా సౌత్‌కోరియాకు చెందిన కిమ్‌ గ ఇయున్‌తో ఢీ కొననుంది.
శ్రీకాంత్‌ తొలి రౌండ్‌లోనే ఇంటికి..
పురుషుల విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. భారత స్టార్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టగా.. మరోవైపు యువ ప్లేయర్‌ సమీర్‌ వర్మ రెండో రౌండ్‌లో దూసుకెళ్లాడు. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఐదో సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ 16 20 తేడాతో అన్‌సీడెడ్‌ శేసర్‌ హీరెన్‌ రుస్టావిటో (ఇండోనేషియా) చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఎన్నో ఆశలతో టోర్నీలో అడుగుపెట్టిన శ్రీకాంత్‌కు ఇండోనేషియా ప్లేయర్‌ ఊహించని షాక్‌ ఇచ్చాడు. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన రుస్టావిటో తొలి గేమ్‌లో శ్రీకాంత్‌ను భారీ తేడాతో ఓడించాడు. ఇక రెండో గేమ్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలబడ్డారు. కానీ ఆఖర్లో టై బ్రేకర్‌లో శ్రీకాంత్‌ రెండు పాయింట్లతో వెనుకబడి మ్యాచ్‌ను కోల్పోయాడు. మరో మ్యాచ్‌లో సమీర్‌ వర్మ 21 17 21 సాకయి కజుమాసా (జాపాన్‌)పై విజయం సాధించి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాడు. తొలి గేమ్‌ను ఈజీగా గెలుచుకున్న సమీర్‌కు రెండో గేమ్‌లో జపాన్‌ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. దాంతో ఆ గేమ్‌ను సమీర్‌ కోల్పోయాడు. ఇక నిర్ణయాత్మకమైన చివరి గేమ్‌లో మాత్రం సమీర్‌ పుంజుకొని మంచి ప్రదర్శను చేశాడు. మ్యాచ్‌ హోరాహోరీగానే జరిగినా ఆఖర్లో ఆధిక్యంలో దూసుకెళ్లిన సమీర్‌ వర్మ మూడు పాయింట్ల తేడాతో ఈ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. సమీర్‌కు తర్వాతి రౌండ్‌లో కఠినమైన ప్రత్యర్థి ప్రపంచ 15వ ర్యాంకర్‌ ఎంగ్‌ క లాంగ్‌ (హాంగ్‌కాంగ్‌) ఎదురుకానున్నాడు.
అర్జున్‌ జోడీకి చుక్కెదురు..
పురుషుల డబుల్స్‌లో భారత జోడీ ఎమ్‌ఆర్‌ అర్జున్‌ శ్లోక్‌లు 18 15 చైనీస్‌ జంట హీ జిటింగ్‌ కియాంగ్‌ చేతిలో ఓటమిపాలై తొలి రౌండ్‌లోనే టోర్నీ నుంచి వైదొలిగారు. మరోవైపు మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో మేఘన జక్కంపుడి రామ్‌ ద్వయం 13 16 కితరకుల్‌ ప్రజొంగ్‌జై (థాయ్‌లాండ్‌) జంట చేతిలో ఓడిపోయారు.

DO YOU LIKE THIS ARTICLE?