సెట్‌లన్నీ జులైలోనే

6న ఎంసెట్‌, 4న ఇసెట్‌, 13న ఐసెట్‌, 15న ఎడ్‌సెట్‌
వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ప్రజాపక్షం/హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంసెట్‌ ప్రవేశపరీక్షను జులై 6 నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి తెలిపారు. అలాగే పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో రాష్ట్ర ఉన్నతా విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి, కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌, వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ప్రొఫెసర్‌ వి.వెంకటరమణతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివిధ ప్రవేశపరీక్షలకు సంబంధించి శనివారం సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ ప్రవేశపరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేశారు. కాగా టిఎస్‌ పిఇసెట్‌ను (ఎంజియు, నల్లగొండ) జులై 16 తర్వాత అనువైన తేదీని ప్రకటించనున్నారు.

ప్రవేశ పరీక్షలు విశ్వవిద్యాలయం పరీక్ష తేదీ
టిఎస్‌ పిజిఇసెట్‌ ఒయు, హైదరాబాద్‌ 01-07-2020 నుండి 03-07-2020)
టిఎస్‌ ఇసెట్‌ జెఎన్‌టియుహెచ్‌ 04-07-2020
టిఎస్‌ ఎంసెట్‌ జెఎన్‌టియుహెచ్‌ 06-07-2020 నుండి 09-07-2020)
టిఎస్‌ లాసెట్‌- టిఎస్‌ పిజిఎల్‌సెట్‌ ఒయు,హైదరాబాద్‌ 10-07-2020
టిఎస్‌ ఐసెట్‌ కెయు,వరంగల్‌ 13-07-2020
టిఎస్‌ ఎడ్‌సెట్‌ ఒయు,హైదరాబాద్‌ 15-07-2020

DO YOU LIKE THIS ARTICLE?