సెకండ్‌ హాఫ్‌లో బాగానే ఆడాం

ఛాలెంజర్స్‌ సారధి కోహ్లీ
బెంగళూరు : ఐపిఎల్‌ సీజన్‌ భాగంగా శనివారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గొప్ప విజయంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టోర్నీను ముగించింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ఆర్‌సిబి తమ లీగ్‌ ఆఖరి మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయం సాధించింది. అయితే మ్యాఛ్‌ అనంతరం ఆర్‌సిబి సారథి విరాట్‌ కోహ్లీ మాట్లాడు తూ.. టోర్నీను వీడడం బాధగా ఉంది. ఫస్ట్‌ హాఫ్‌లో మేము ఆశించిన స్థాయంలో రాణించలేక పోయాం. కానీ సెకండ్‌ హాఫ్‌లో మాత్రం తమ ప్రదర్శన బాగా మెరుగుపడింది. రెండో అర్ధభాగంలో మా జట్టు అద్భుతంగా ఆడింది. ఇదే దృష్టి మొదటి భాగంలోనూ పెడితే పరిస్థితులు మరోలా ఉండేవని అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఐపిఎల్‌ లాంటి మెగా టోర్నీలో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓటమి తర్వాత తిరిగి పుంజుకోవడం చాలా కష్టమైన పని. అయితే, ఈ విషయంలో గొప్పతనం మొత్తం జట్టు యాజమాన్యానిదే. ఓటములు ఎదురవుతున్నా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించింది. అనుకున్న స్థానంలో టోర్నీని ముగించలేకపోయినప్పటికీ రెండో అర్ధబాగాన్ని చూస్తే మాత్రం టోర్నీలో మా ప్రదర్శన బాగానే ఉందన్న భావన కలిగింది. చివరి 7 మ్యాచుల్లో మేం 5 విజయాలు సాధించాం. ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఈ విషయంలో మేం జట్టుగా గ ర్వపడుతున్నాం. సెకండ్‌ హాఫ్‌ ఫలితాలు తమ అభిమానులను కూడా సంతృప్తి పరిచాయనుంకుంటున్నా’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?