సూపర్‌ సైనా..

ఫైనల్లో దూసుకెళ్లిన భారత స్టార్‌
సెమీస్‌లో బింగ్‌జియావోపై విజయం
నేడు మారిన్‌తో టైటిల్‌ పోరు
ఇండోనేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌
జకార్తా: భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఇండోనేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్స్‌లో దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో హైదరాబాదీ ఎనిమిదో సీడ్‌ సైనా నెహ్వాల్‌ 18 21 21 తేడాతో చైనాకు చెందిన ఆరో సీడ్‌ హి బింగ్‌జియావోపై విజయం సాధించి టైటిల్‌ పోరుకు సిద్ధమయింది. ఈ ఏడాది మంచి ప్రదర్శనలు చేస్తున్న సైనా మలేషియా మాస్టర్స్‌లో సెమీస్‌ వరకు వెళ్లింది. తాజాగా ఇండోనేషియా ఓపెన్‌లో ఫైనల్లో ప్రవేశించి భారత అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. ఇక ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో సైనా నెహ్వాల్‌ స్పెయిన్‌ స్టార్‌ ఐదో సీడ్‌ కారొలినా మారిన్‌తో ఢీ కొననుంది. వరుస విజయాలతో జోరుమీదున్న మారిన్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్‌ రెండో సీడ్‌ పివి సింధును ఓడించింది. శనివారం జరిగిన మరో సెమీఫైనల్లో మారిన్‌ 17 21 23 చైనా స్టార్‌ మూడో సీడ్‌ చెన్‌ యూఫీను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక్కడ జరిగిన మొదటి సెమీఫైనల్లో సైనా నెహ్వాల్‌కు తొలి గేమ్‌లో చుక్కెదురైంది. చైనా ప్రత్యర్థి దూకుడును తట్టుకోలేక సైనా తొలి గేమ్‌ను 18 కోల్పోయింది. తర్వాత పుంజుకున్న సైనా ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగింది. సుదీర్ఘమైన ర్యాలీలు, స్మాష్‌లతో ఆకట్టుకున్న సైనా 21 రెండో గేమ్‌ను గెలుచుకొని మ్యాచ్‌ను సమం చేసింది. ఇక ఆఖరిదైన మూడో గేమ్‌ ఇద్దరికి కీలకంగా మారింది. ఈ గేమ్‌లో ఇద్దరూ మరోసారి హోరాహోరీగా తలపడ్డారు. ఇక మ్యాచ్‌ను ఎలాగైన గెలువాలనే దృఢసంకల్పంతో ఉన్న సైనా చివర్లో దూకుడును మరింతగా పెంచింది. ఈ క్రమంలోనే సైనా ప్రత్యర్థిపై మూడు పాయింట్ల ఆధిక్యం సాధించి 21 ఆఖరి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది.

DO YOU LIKE THIS ARTICLE?