సికింద‌ర్‌గూడ భూమి కేసు విచార‌ణ వాయిదా

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా జడ్జి సికిందర్‌ గూడలోని వివాదాస్పద భూమి సంబంధించిన కేసు విచారణ జూన్‌ వాయిదా పడింది. 187 ఎకరాల పైగా భూమి అని, పైగా వారసుల నుంచే భూమిని కొనుగోలు చేశామని వజారా ఇన్ఫ్రా అనే కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే అందులో 11 ఎకరాలు తమకు సంబంధించిన ఈనాం భూములు ఉన్నాయని బుర్ర వేణుగోపాల్‌ జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు ఈ అప్పీలు రిట్‌ పిటిషన్లను సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక రెడ్డి లతో కూడిన ధర్మాసనం విచారించింది. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ అందుబాటులో లేనందున విచారణ వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది

DO YOU LIKE THIS ARTICLE?