సింధూ ఔట్‌

సెమీస్‌లో ఒకుహరా చేతిలో పరాజయం
సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
సింగపూర్‌: సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌ పోరాటం ముగిసింది. ఇప్పటికే స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌, సమీర్‌ వర్మలు క్వార్టర్స్‌లోనే ఇంటి ముఖం పట్టగా.. ఇప్పుడు తాజాగా తెలుగు తేజం పివి సింధు కూడా సెమీస్‌లో ఓటమిపాలై టోర్నీ నుంచి వైదొలిగింది. శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ సింధు 7 11 తేడాతో రెండో సీడ్‌ జపాన్‌ సంచలనం నొజొమీ ఒకుహరా చేతిలో వరుస గేమ్‌లలో ఓటమిపాలైంది. ఒకుహరా దూకుడు ముందు మన తెలుగుతేజం పూర్తిగా తేలిపోయింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన జపాన్‌ స్టార్‌ తొలి గేమ్‌లో సింధును 21 చిత్తు చేసింది. తర్వాతి గేమ్‌లోనూ సింధు ప్రత్యర్థికి ఎలాంటి పోటీ ఇవ్వలేక పోయింది. వరుస స్మాష్‌లతో సింధును ఉక్కిరిబిక్కిరి చేసిన ఒకుహరా భారీ తేడాతో ఈ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకొని ఫైనల్లో దూసుకెళ్లింది. దీంతో టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలో దిగిన సింధు పోరాటం సెమీస్‌లోనే చెదిరిపోయింది. మరో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ థైపీ) 15 24 21 మూడో సీడ్‌ ఆకనె యమగూచి (జపాన్‌)పై విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించింది. ఇక ఆదివారం ఫైనల్లో టాప్‌ సీడ్ల మధ్య టైటిల్‌ పోరు జరగనుంది.
ఫైనల్లో మొమోటా..
పురుషుల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ జపాన్‌ స్టార్‌ ప్లేయర్‌ కెంటొ మొమోటా ఫైనల్లో దూసుకెళ్లాడు. శనివారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ మొమోటా (జపాన్‌) 21 21 తేడాతో డెన్మార్క్‌కు చెందిన మూడో సీడ్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌ను వరుస గేమ్‌లలో చిత్తు చేసి తుదిపోరుకు సిద్ధమయ్యాడు. మరో సెమీస్‌లో రెండో సీడ్‌ చౌ థెన్‌ చెన్‌ (చైనీస్‌ థైపీ)ను ఏడో సీడ్‌ అంథోనీ సినిసుకా గింటింగ్‌ షాకిచ్చాడు. ఈ మ్యాచ్‌లో అంథోనీ (ఇండోనేషియా) 21 18 21 చౌ థెన్‌ చెన్‌పై విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించాడు. ఇక ఫైనల్లో టాప్‌ సీడ్‌ మొమోటాతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?