సింధు పరాజయం

బాడ్మింటన్‌ సెమీస్‌లో ఓటమి
కాంస్య పతకంపైనే ఆశ
టోక్యో: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకొని, ఈసారి టోక్యోలో స్వర్ణంపై గురిపెట్టిన భారత బాడ్మింటన్‌ స్టార్‌ పివి సింధు నిరాశ పరచింది. మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్‌లో చైనీస్‌తైపీ క్రీడాకారిణి తాయ్‌ జు ఇంగ్‌తో తలపడిన ఆమె 18 12 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ మొదటి సెట్‌లో కొంత వరకూ పోరాడిన సింధు అనూహ్యంగా రెండో సెట్‌లో దారుణంగా విఫలమైంది. మరోవైపు తాయ్‌ జు వ్యూహాత్మకంగా ఆడుతూ సింధుపై పట్టు బిగించింది. ఆమెకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దాడులను కొనసాగించింది. మొదటి సెట్‌ ఉత్కంఠ భరితంగా సాగినప్పటికీ, రెండో సెట్‌లో అదే స్థాయి పోరు కనిపించకపోవడం గమనార్హం. కాగా, సెమీఫైనల్‌లో ఓడిన కారణంగా ఆమె కాంస్య పతకం కోసం పోరాటం సాగించాల్సి ఉంటుంది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించాలంటే ఆమె ఆదివారం జరిగే మ్యాచ్‌లో చైనాకు చెందిన యే బింగ్‌ జియావోను ఓడించాలి. అంతకు ముందు జరిగిన మరో సెమీ ఫైనల్‌లో చెన్‌ యో ఫెయ్‌ చేతిలో బింగ్‌ జియావో పరాజయాన్ని చవిచూసింది. వ్యూహాత్మకంగా ఆడుతూ సింధుపై పట్టు బిగించింది. ఆమెకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దాడులను కొనసాగించింది. మొదటి సెట్‌ ఉత్కంఠ భరితంగా సాగినప్పటికీ, రెండో సెట్‌లో అదే స్థాయి పోరు కనిపించకపోవడం గమనార్హం. కాగా, సెమీఫైనల్‌లో ఓడిన కారణంగా ఆమె కాంస్య పతకం కోసం పోరాటం సాగించాల్సి ఉంటుంది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించాలంటే ఆమె ఆదివారం జరిగే మ్యాచ్‌లో చైనాకు చెందిన యే బింగ్‌ జియావోను ఓడించాలి. అంతకు ముందు జరిగిన మరో సెమీ ఫైనల్‌లో చెన్‌ యో ఫెయ్‌ చేతిలో బింగ్‌ జియావో పరాజయాన్ని చవిచూసింది.

DO YOU LIKE THIS ARTICLE?