సమీర్‌వర్మకు షాక్‌

మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
కౌలాలంపూర్‌ : మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ సమీర్‌ వర్మకు షాక్‌ తగిలింది. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషు ల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సమీర్‌ వర్మ (భారత్‌) 20 23 12 చైనా సంచల నం, రెండో సీడ్‌ షీ యూకి చేతిలో ఓటమిపాలై టో ర్నీ నుంచి నిష్క్రమించాడు. చైనా స్టార్‌ ఆటగాడికి భారత యువ ఆటగాడు గట్టి పోటీ ఇచ్చాడు. తొలి గేమ్‌ నుంచే ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఒక పాయింట్‌ యూకి సాధిస్తే మరో పాయింట్‌ స మీర్‌ చేశాడు. ఇలా ఇద్దరూ మొదటి గేమ్‌లో ఉ త్కంఠగా తలపడ్డారు. ఆఖరికి ఈ గేమ్‌ టై బ్రేకర్‌ కు దారి తీసింది. ఇక టై బ్రేకర్‌లో జోరును ప్రదర్శి ంచిన రెండో సీడ్‌ సమీర్‌పై 22 నెగ్గాడు. తర్వాతి గేమ్‌లోనూ ఇద్దరూ హోరాహోరీగా ఆడా రు. ఒకరిపై మరొకరూ ఎదురుదాడులను చేసుకుంటూ ముందుకు సాగారు. చెరో పాయింట్‌ చేసుకుంటూ పోవడంతో ఈ గేమ్‌ కూడా టై బ్రేకర్‌కు దారి తీసింది. అయితే చివర్లో జోరును ప్రదర్శించిన సమీర్‌వర్మ 23 గెలిచి మ్యాచ్‌ను సమం చేశాడు. ఇక ఆఖరిదైన నిర్ణయాత్మక గేమ్‌లో రెండో సీడ్‌ ముందు సమీర్‌వర్మ తేలిపోయాడు. ఏకపక్షంగా సాగిన మూడో గేమ్‌లో షీ యూకి 21 తేడాతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్‌ ఇతర మ్యాచుల్లో 8వ సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ ఇండోనేషియాకు చెందిన మౌ లానా ముస్తాఫాతో, హెచ్‌ ప్రణయ్‌ థాయ్‌లాండ్‌ కు చెందిన థమసిన్‌తో తలపడనున్నారు.
సిక్కి జోడీ శుభారంభం..
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జోడీ సిక్కిరెడ్డి, ప్రణవ్‌ జెర్రీ చోప్రా శుభారంభం చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సి క్కిరెడ్డి, ప్రణవ్‌ జెర్రీ చోప్రా 22 24 22తో సామ్‌ మాగీ, చోలె మాగీ (ఐర్లాండ్‌)పై చె మటోడ్చి నెగ్గారు. ఇక మహిళల డబుల్స్‌లో అశ్వి ని పొన ప్ప, సిక్కి రెడ్డి ద్వయం 20 21 17, 20 22 తేడాతో కోరియా జంట బీక్‌ హ నా, హై రిన్‌ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి వైదొలిగింది.

DO YOU LIKE THIS ARTICLE?