సన్‌రైజర్స్‌కు కఠిన పరీక్ష

నేడు ముంబయితో కీలక పోరు
ముంబయి: కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌పై గెలిచి ప్లే ఆ ఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకున్న సన్‌రైజర్స్‌కు మ రో కఠిన పరీక్ష గురువారం ఎదురుకానుంది. పటిష్టమైన ముంబయి ఇండియన్స్‌తో హైదరాబాద్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు నెలకొంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే హైదరాబాద్‌ ప్లే ఆఫ్‌ రేసులో నిలవగలదు. ఇప్పటికే ప్లే ఆఫ్‌ రేసులో తీవ్ర పోటీ నెలకొంది. అయితే బలమైన ప్రత్యర్థి నేడు సన్‌రైజర్స్‌ ఢీ కొననుంది. ఇక జట్టు స్టార్‌ ఆటగాడు డేవి డ్‌ వార్నర్‌ అందుబాటులో లేక పోవడంహైదరాబాద్‌కు పెద్ద సమస్యే. ఒంటి చెత్తో సన్‌రైజర్స్‌కు ఎ న్నో గొప్ప విజయాలు అందించిన వార్నర్‌ సేవలు లేక పోవడం ఈ జట్టుకు పెద్ద పరీక్ష లాంటిదే. ఇక జట్టు భారమంతు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మీదే ఉంది. గత సీజన్‌లో తన అద్భుతమైన సారథ్యంతో సన్‌రైజర్స్‌ను రన్నరప్‌గా నిలిపిన విలియమ్సన్‌ మరోసారి జట్టును ఆదుకోవాల్సిన సమ యం వచ్చింది. మరోవైపు ముంబయికు కూడా ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. ఇందులో గెలిస్తే ముంబయి ప్లేఆఫ్‌కు దూసుకెళుతోంది. ఒకవేళ ఓడితే మాత్రం కాస్త ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశాలుంటాయి. అలాంటి పరిస్థితి రాకుండా చూ డాలంటే విజయం సాధించడం ఒక్కటే ముందు న్న మార్గం. ఇరు జట్లకు కూడా మ్యాచ్‌ కీలకంగా మారడంతో ఈ మ్యాచ్‌ హోరాహోరీగా జరగడం ఖాయమనిపిస్తోంది. ఇక ముంబయిను వారి సొం త మైదానంలో ఓడించడం హైదరాబాద్‌కు అంత ఈజీ కాదనే చెప్పాలి. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌లు వార్న ర్‌, బెయిర్‌ స్టోలు లేక పోవడంతో హైదరాబాద్‌ బ్యాటింగ్‌ బలహీనంగా మారింది. మనీశ్‌ పాండే ఫామ్‌లో రావడం హైదరాబాద్‌కు ఊరాటనిచ్చే అంశం. ఏదిఏమైన గురువారం వాంఖడే వేదికగా జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?