షూటింగ్‌లో ‘ద ఫిలిం డైరెక్టర్‌ 8500400789’

ఫిలిం రిక్రూట్‌ మెంట్‌ సర్వీసెస్‌ పతాకంపై వరుణ్‌ తేజ్‌ పినికాశి దర్శకత్వంలో పి. నాగలక్ష్మి నిర్మిస్తోన్న చిత్రం ‘ద ఫిలిం డైరక్టర్‌ 85004 00789’. వరుణ్‌ తేజ్‌ పినికాశి టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న ఈ చిత్రం శరవేగంగా షూ టింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ని ర్మాత పి.నాగలక్ష్మి మాట్లాడుతూ.. “సినిమా నేపథ్యంలో జరిగే కథాంశమిది. ఎన్నో ఆశలతో , ఆశయాలతో సినిమా రంగంలోకి వచ్చే నటీనటులు, సాంకేతిక నిపుణులను కొంత మంది అవకాశాల పేరిట ఎలా మోసాలు చేస్తున్నారు? ఎలా మోసపోతున్నారు? అనేది మా సినిమాలో చూపిస్తున్నాం. ప్రజంట్‌ 24 క్రాఫట్స్‌ లో జరుగుతున్న మోసాలు చూపిస్తున్నాం. అలాంటి వ్యక్తుల నుంచి తప్పించుకుని చివరకు మా డైరక్టర్‌ ఎలా సినిమా తీసాడు. దాన్ని ఎలా రిలీజ్‌ చేసాడు అన్నది ఆసక్తికరమైన అంశం. దీనితో పాటు ఇందులో మంచి కామెడీ, లవ్‌ ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ఇటీవల మార్షల్‌ ఆరట్స్‌ లో గోల్డ్‌ మెడల్‌ అందుకున్న వరుణ్‌ తేజ్‌ పినికాశి టైటిల్‌ రోల్‌ లో నటిస్తున్నారు. ‘తమ్ముడు’ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ గారు చేసిన రేర్‌ ఫీట్స్‌ చేతులపై కారు ఎక్కించుకోవడంలాంటి సన్నివేశాలు మా హీరో కూడా చేస్తున్నారు. ప్రజంట్‌ దానికి సంబంధించిన ట్రైనింగ్‌ లో ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది” అన్నారు. వరుణ్‌ తేజ్‌ పినికాశి, మేఘన చౌదరి జంటగా నటిస్తోన్నీ ఈ చిత్రంలో సీనియర్‌ నటులు జీవా, జ్యోతి తో పాటు పలువరు కొత్త వారు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం-ఎడిటింగ్‌ః పూర్ణచంద్ర భైరి; కెమేరాః బాలకిషన్‌; ప్రొడ్యూసర్‌ః పి.నాగలక్ష్మి; రచన-దర్శకత్వంః వరుణ్‌ తేజ్‌ పినికాశి.

DO YOU LIKE THIS ARTICLE?