శ్రావణి హత్యపై అలజడి

ఉద్రిక్తతల మధ్య శ్రావణి అంత్యక్రియలు
రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ హామీతో ధర్నా విరమణ

ప్రజాపక్షం/ బొమ్మల రామారం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రావణి అంత్యక్రియలు ఉద్రిక్తతల మధ్య ఆమె స్వగ్రామ మై భువనగిరి యాదాద్రి జిల్లా హాజిపురంలో శనివారం ముగిశాయి. గురువారం కీసరలో సెరినిటి ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి ప్రైవేట్‌ క్లాస్‌ కు వెళ్లిన శ్రావణి తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బొమ్మల రామారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు  చేశారు. శుక్రవారం వరకు అమ్మాయి ఆచూకీ కనుగొనడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కుటుంబసభ్యులు గ్రామస్థులతో కలిసి శ్రావణి ఆచూకీ కో సం వెతకగా హాజిపురం గ్రామ శివారులోని మర్రిబావిలో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు ఆచూకీ కనుగొనడంలో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహంతో అక్కడికి చేరుకున్న డిసిపి సురేందర్‌రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. అనంతరం పోలీసులు భారీ బందోబస్తు మధ్య శ్రావణి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని శ్రావణి మృతదేహంతో భువనగిరి ఏరియా ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.

DO YOU LIKE THIS ARTICLE?