వేం నరేందర్‌రెడ్డిని ప్రశ్నించిన ఇడి

ఓటుకు నోటు కేసులో విచారించిన అధికారులు
19న హాజరుకావాలని రేవంత్‌రెడ్డికి ఇడి నోటీసు
ప్రజాపక్షం/ హైదరాబాద్‌ : ఓటుకు నోటు కేసులో ఇడి అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో మాజీ ఎంఎల్‌ఎ వేం నరేందర్‌రెడ్డి మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నామినేటెడ్‌ ఎంఎల్‌ఎ స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ. 50  లక్షలతో పాటు రెండో విడతలో ఇవ్వాల్సి ఉన్న మరో నాలుగున్నర కోట్లు ఎక్కడ అంటూ నరేందర్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఆదాయ పన్ను, అవినీతి నిరోధకశాఖ ఇచ్చిన సమాచారంతో ఇడి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగింది. నరేంద్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు కీర్తన్‌రెడ్డి కూడా ఇడి విచారణకు హాజరయ్యారు. స్టీఫిన్‌సన్‌కు ఇచ్చిన డబ్బులు, ఇంకా ఇవ్వజూపిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఆ డబ్బుకు యజమాని ఎవరో ఇంత వరకు తేలలేదు. దీనిపై ఇడి అధికారులు వేం నరేందర్‌రెడ్డి నుంచి కూపీ లాగినట్లు తెలిసింది.

DO YOU LIKE THIS ARTICLE?