వెల్లివిరిసిన ఓటరు చైతన్యం

రెండో విడత పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతం
భారీగా నమోదైన పోలింగ్‌

ప్రజాపక్షం / హైదరాబాద్‌: రాష్ట్రంలో శుక్రవారం జరిగిన రెండో విడత జడ్‌పిటిసి, ఎంపటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగా యి. మొత్తం 10,371పోలింగ్‌ కేంద్రాలను ఏర్పా టు చేశారు. వేసవి కావడంతో ఎండ ముదరకముందే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వా త పోలింగ్‌ కాస్తా మందగించింది. తిరిగి 4 గంటల నుంచి పోలింగ్‌ వేగం పుంజుకుంది. సమస్యాత్మక ప్రాంతాలైన 218 స్థానాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగిసింది. మిగిలిన చోట్ల సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ నిర్వహించడంతో పాటు ఆలోపు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన వారిని ఓటు వేసేందుకు అనుమతించారు.మధ్యాహ్నం మూడు గంటల వరకు 69.68శాతం పోలింగ్‌ నమోదయింది. తొలి విడత మాదిరిగానే ఈ సారి భారీగానే పోలింగ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. పోలి ంగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు అధికార యం త్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. పోలింగ్‌స్టేషన్ల వద్ద 144వ సెక్షన్‌ విధించారు. ఇతర మండలాల వారు ఎవరు లేకుండా చర్యలు తీసుకున్నా రు. మద్యం విక్రయాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బెల్ట్‌ షాపులను మూసివేయించా రు. పొరుగున ఉన్న మండలాల నుంచి మద్యం రాకుండా ఆయా గ్రామాలకు వచ్చే దారుల్లో తని ఖీ బృందాలను ఏర్పాటు చేశారు. 300లోపు ఓట ర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రంలో ముగ్గురిని, అంత కంటే ఎక్కువ ఓటర్లున్న పోలింగ్‌ కేంద్రం లో ఐదుగురు పోలింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 180 జడ్‌పిటిసి స్థానాలకు పోలింగ్‌ నిర్వహించాల్సి ఉండగా ఒకటి ఏకగ్రీవం కావడంతో 179 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. వీటికి మొత్తం 2008 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?