వీళ్లు తల్లిదండ్రులేనా..?

దంపతుల మధ్య విబేధాలు.. పిల్లల పాలిట శాపాలు
ఆర్‌సిపురంలో ఇద్దరు పిల్లల్ని, జీడిమెట్లలో ఓ కుమార్తెను హతమార్చిన తండ్రులు

ప్రజాపక్షం/హైదరాబాద్‌: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తన చిన్నారి కుమారుడిని గొంతు కోసి హతమార్చా డు… భర్త వేధింపులను భరించలేని భార్య తన కన్న పిల్లలను చంపేసింది… అప్పుల బాధతో పిల్ల ల్ని చంపేసి ఆత్మహత్యకు పాల్పడ్డ దంపతులు… గొడవ పడి భార్య పుట్టింటికి వెళ్లిందనే కక్షతో కన్న కూతూర్ని కడతేర్చిన తండ్రి… ఇలాంటి ఘటనలు తరచు ఎక్కడో అక్కడ చోటుచేసుకుంటునే ఉన్నా యి. కారణాలు ఏవైనా పిల్లల పాలిట కన్నవాళ్లే శాపాలుగా మారుతున్నారు. తమ తల్లిదండ్రుల చేతిలో ఎప్పుడు హత్యకు గురవుతామోననే భయ ంతో బతుకీడుస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. తల్లిదండ్రుల చేతిలో అల్లారుముద్దుగా పెరుగుతున్న పిల్లలు వారి చేతిలోనే ఎప్పుడు చంపబడుతారో తెలియని రోజులొచ్చాయి. తమ ప్రాణాలను తల్లిదండ్రులే తీస్తారన్న నగ్నసత్యంను అభంశుభం తెలియని ఆ పిల్లలు కలలో కూడా ఊహించుకోరు. క్షణికావేశంలో దంపతులు ఇలాంటి దురాఘాతాకు పాల్పడడం విడ్డూరంగా ఉంది. సంతా నం లేని దంపతులు తమకు పిల్లలు కలగాలని తిరగని చెట్టు, పుట్ట ఉండదు. దేశంలోని అన్ని దేవాలయాలకు వెళ్లి తమకు సంతానం కలగాలని భగవంతున్ని కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులే చిన్నాచితక తగాదాల వల్ల తమ పిల్లలను నిర్ధాక్ష్యంగా చంపుకుంటున్న ఉదంతాలు కొకొల్లలు. దంపతుల మధ్య తలెత్తె వివాదాల వల్ల వారి కోపం పిల్లలపై చూపడం అమానుషం. నిస్సహాయతో.. ఆవేశ మో.. వారిని కర్కశులుగా మార్చేస్తోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నబిడ్డలనే చేజేతులా చంపుకునేలా పురికొగొల్పుతోంది. వింటే నే చలించిపోయే ఇలాంటి హృదయ విదారక సంఘటనలు తరుచూ ఎక్కడోఅక్కడ చోటుచేసుకుంటునే ఉన్నాయి. ఇలాంటి ఉదంతాలు మచ్చుకు కొన్ని…
ఈనెల 17న రాంచంద్రాపురం పోలీసు స్టేషన్‌ పరిధిలో.. పుట్టింటికి వెళ్లిన భార్య శిరీష కాపురానికి రావడం లేదనే కక్షతో భర్త కుమార్‌ తన ఇద్దరు పిల్లలు అఖిల్‌ (6), శరణ్య (4)ను చంపేశాడు. మరో కూతురు మల్లేశ్వరి (10)ని చంపేందుకు యత్నించగా ఆమె తప్పించుకుని బయటికి పారిపోయింది.
మంగళవారం జీడిమెట్ల పోలీసు స్టేషన్‌ పరిధిలో భార్య సుశీలపై అనుమానం పెంచుకున్న భర్త నారాయణరెడ్డి క్షణికావేశంలో తన కుమార్తె దీక్ష (13 నెలలు)ను గొంతుకోసి హతమార్చాడు.
ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సృజన, రవిశంకర్‌ దంపతుల కూతురు సాయిపూజిత (4) ఒక్కగానొక్క సంతానం. గుండెజబ్బుతో బాదపడుతున్న సాయిపూజితను మెరుగైన చికిత్స అందించలేని దంపతులు తరచు గొడవ పడేవారు. ఇదంతా కూతురు వల్లనే గొడవలు వస్తున్నాయని గ్రహించిన దంపతులు సాయిపూజితను నెలకోసి కొట్టి చంపేశారు.

DO YOU LIKE THIS ARTICLE?