వివిప్యాట్‌ స్లిప్పుల లెక్కింపులో సమస్యేంటి?

ఎన్నికల సంఘాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ఎన్నికల్లో వివిప్యాట్‌ స్లిప్పుల లెక్కింపులో మీకున్న సమస్యలేంటో స్పందించాలని సుప్రీంకోర్టు సోమవారంనాడు భారత ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇసి తీరు పట్ల న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. వివిప్యాట్‌ స్లిప్పుల లెక్కింపును ఎందుకు పెంచట్లేదో తెలియజేయాలని ఆదేశించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 50శాతం మేర ఓటు రసీదు యంత్రాలను(వివిప్యాట్‌ స్లిప్పు లు) లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాల దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ‘వివిప్యాట్‌ స్లిపు ్పల లెక్కింపును పెంచాలనుకుంటున్నారా? ఒకవేళ పెంచకపోతే స్లిప్పుల లెక్కింపులో ఈసీకి ఉన్న ఇబ్బందులను తెలియజేస్తూ మార్చి 28 సాయం త్రం 4 గంటలలోగా అఫిడవిట్‌ దాఖలు చేయం డి’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రక్రియతో మీరు సంతృప్తిగా ఉంటే అందుకు గల కారణాలు కూడా తెలియజేయాలని పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్‌ 1కి వాయిదా వేసింది. ప్రస్తుతం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇవిఎంను మాత్రమే వివిప్యాట్‌ స్లిప్పులతో లెక్కించి సరిచూస్తున్నారు. అయితే ఈ స్లిప్పుల లెక్కింపును ఎందుకు పెంచలేకపోతున్నారని, ఈ విషయంలో ఎదురయ్యే ఇబ్బందులేంటో చెప్పకపోతే, దేశంలో ఎన్నికల ప్రక్రియ పట్ల గందరగోళం కొనసాగుతూనే వుంటుందని కోర్టు అసహనం వ్యక్తంచేసింది. దీనికి ఇసి తరఫున కోర్టుకు హాజరైన సుదీప్‌ జైన్‌ స్పందిస్తూ.. ప్రత్యేక కారణాల వల్లే లెక్కింపు పెంచడం లేదని తెలిపారు. అయితే ఇదే సమాధానంతో అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టుఎన్నికల సం ఘాన్ని ఆదేశించింది. వివిప్యాట్లకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదులో దేశంలోని ప్రధాన ప్రతిపక్షాల నేతల సంతకాలు వుండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఫిర్యాదు చేసిన వారి లో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్‌, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌, జ మ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, ఎస్పీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్యాదవ్‌, సతీష్‌ చంద్ర మిశ్రా తదితరులున్నారు. సంతకాలు చేసిన పార్టీల్లో 21 పార్టీలున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?