విభజన అడ్డంకి

ఎపిలో అమలవుతున్నా.. తెలంగాణలో కొర్రీలు
ఫైలును తిప్పిపంపిన ఆర్థిక శాఖ
వికలాంగుల కార్పొరేషన్‌ ఉద్యోగుల్లో ఆందోళన
హైదరాబాద్‌ : వంద మంది ఉద్యోగులు కూడా లేని సంస్థలో పిఆర్‌సిల అమలుకు విభజన సమస్య అడ్డంకిగా మారింది. ఎపిలో లేని అభ్యంతరం తెలంగాణలో పుట్టుకొచ్చింది. 2009, 2014 పిఆర్‌సిల అమలుకు వికలాంగుల సంక్షేమ శాఖ పంపిన ఫైలును ఆర్థిక శాఖ తిప్పిపంపింది. విభజన పూర్తి కానిదే పిఆర్‌సిలు అమలు చేయలేమని తెగేసి చెప్పింది. దీంతో పిఆర్‌సిల అమ లు కాగితాలకే పరిమితం అయ్యింది. వికలాంగుల కార్పొరేషన్‌ విభజనకు ఎపి మోకాలొడ్డుతోంది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో 39 జిఒ ప్రకా రం కార్పొరేషన్‌లో కొంతమంది ఉద్యోగులను విధుల నుండి తొలగించారు. అయితే వారు హైకోర్టుకు వెళ్ళారు. దీంతో కోర్టు స్టే ఇవ్వడంతో ఆ ఉద్యోగులు విధుల్లో కొనసాగుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?