విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని నేడు, రేపునిరసనలు

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్‌: విద్యుత్‌ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 15, 16 తేదీల్లో (నేడు, రేపు) సిపిఐ ఆధ్వర్యంలో విద్యుత్‌ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టను న్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన ఆదివారం ఒక ప్రకనటలో కోరారు. రాష్ట్రంలో దాదాపు 87 లక్షల కుటుంబాల గృహ విద్యుత్‌ వినియోగదారులు అధిక బిల్లులతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యుత్‌ బిల్లులు నెలవారీగా కాకుండా మూడు నెలలకు ఒకేసారి రీడింగ్‌ తీసి, యూనిట్లను ఒకేసారి లెక్కిచండంతో శ్లాబులు మారి ఎక్కువ బిల్లులు వచ్చాయన్నారు. అల్పాదాయ, మధ్యదాయ గృహ విద్యుత్‌ వినియోగదారులకు 50, 100, 150, 200 యూనిట్ల చొప్పున నాలుగు శ్లాబులలో క్రాస్‌ సబ్సిడీ లభించేదని, ఒకేసారి రీడింగ్‌ తీసినందువల్ల బిల్లులు ఎక్కువ వచ్చాయని చాడ వెంకటరెడ్డి అన్నారు. అధిక బిల్లులకు వ్యతిరేకంగా నేడు, రేపు విద్యుత్‌ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?