విండీస్‌దే సిరీస్‌

రెండో టెస్టులోనూ ఓడిన ఇంగ్లాండ్‌
ఆంటిగ్వా: వరుసగా రెండో టెస్టులోనూ ఇంగ్లాండ్‌ను ఓడించిన వెస్టిండీస్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2 కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 187 పరురుగులకు కుప్పకూలిన ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కూడా 132 పరుగులకే పరిమితమైంది. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో 306 పరుగులు చేసిన వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి నిర్ధేశించిన 14 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. ఫలితంగా 10 వికెట్ల ఘన విజయాన్ని సాధించింది. విండీస్‌ తరఫును చెలరేగి బౌలింగ్‌ చేసిన కీమర్‌ రోచ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి విండీస్‌ విజయంలో రోచ్‌ కీలక పాత్ర పోషించాడు. ఆదివారం 272/6 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌ చేపట్టిన విండీస్‌ 306 పరుగులకు ఆలౌటై 119 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ జట్టుపై కరీబియన్‌ బౌలర్లు విరుచుకుపడ్డారు. వీరి ధాటికి ఇంగ్లాండ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. కీమర్‌ రోచ్‌, కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ చెరో 4 వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లాండ్‌ 42.1 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైపోయింది. ఇంగ్లాండ్‌లో జాస్‌ బట్లర్‌ (24) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 14 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 2.1 ఓవర్లలో 17/0 పరుగులు చేసి భారీ విజయాన్ని నమోదుచేసింది.

DO YOU LIKE THIS ARTICLE?