వారిని చూసి నేర్చుకోండి

గ్రేమ్‌ హిక్‌
మెల్‌బోర్న్‌: బ్యాటింగ్‌లో విఫలమవుతున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్‌పై ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ గ్రేమ్‌ హిక్‌ మండిపడ్డాడు. భారత బ్యాట్స్‌మెన్స్‌ విరాట్‌ కోహ్లీ, చతేశ్వర్‌ పుజారాలను చూసి బ్యాటింగ్‌ ఎలా చేయాలో నేర్చుకోవాలని చెప్పాడు. మెల్‌బోర్న్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున బాక్సింగ్‌ డే టెస్టులో భారత బ్యాట్స్‌మెన్స్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. పుజారా (106) పరుగులు చేయగా.. కోహ్లీ (82) పరుగులతో రాణించాడు. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 443/7 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు భారత బౌలర్ల ధాటికి 151 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్‌లో పేలవమైన బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్స్‌పై హిక్‌ అసహనం వ్యక్తం చేశాడు. పిచ్‌ పరిస్థితులను బట్టి ఎలా ఆడాలో ప్రత్యర్థి జట్టును చూసి నేర్చుకోవాలని తమ బ్యాట్స్‌మెన్స్‌కు సూచించాడు.

DO YOU LIKE THIS ARTICLE?