వారణాసికి కదిలిన రైతుల దండు

మోడీపై పోటీకి సై
పసుపుబోర్డు కోసం మరోమారు లోక్‌సభ బరిలోకి..
నిజామాబాద్‌ నుండి 45మంది!
తమిళనాడు నుండి 100మంది

ప్రజాపక్షం/నిజామాబాద్‌: వారణాసికి రైతుల దండు కదిలింది.. మరోమారు లోక్‌సభ బరిలోకి దిగనుంది. ప్రధాని నరేంద్రమోడీపై పోటీకి సిద్ధమైంది. నిజామాబాద్‌ నుండి 45మంది రైతులు గురువారం వారణాసికి బయల్దేరారు. వారణాశి లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వారం తా ఈ నెల 27, 28 తేదీల్లో నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. పసుపుబోర్డు ఏర్పా టు కోసం చేసే పోరాటాన్ని దేశవ్యాప్తంగా చాటేందుకు మాత్రమే ఎన్నికల బరిలోకి దిగుతున్నామ ని, అప్పుడైనా పాలకులకు కనువిప్పు కలిగి తమ డిమాండ్లను నెరవేరుస్తారేమోననే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన 45 మంది రైతులు ప్రత్యేక బస్సులో ఆర్మూర్‌ నుండి గురువారం బయలుదేరారు. నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పసుపు రైతులు నామినేషన్లు వేసేందుకు బయల్దేరారు. పసుపు బోర్డు సాధించడమే లక్ష్యంగా తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళుతున్నామని రైతు లు వెల్లడించారు. వారణాసిలో మోడీపై నామినేషన్లు వేసి రైతుల బాధ, సత్తా చూపెట్టి దేశ వ్యాప్తంగా రైతు బాధలు తెలిసే విధంగా చేస్తామన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వరకు ప్రత్యేక బస్సులో ప్రయాణించి అక్కడి నుండి రైలులో వారణాసికి చేరుకుంటామని రైతు ప్రతినిధులు తెలిపా రు. ఈనెల 27, 28 తేదిల్లో వారణాసిలో స్వతం త్ర అభ్యర్థులుగా తమ నామినేషన్లు వేయడం జరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా పసు పు బోర్డు, పంటలకు మద్దతు ధర సాధించడం మాత్రమే తమ పోరాటమని రైతులు స్పష్టం చేశారు. అదే విధంగా తమిళనాడు రైతులు కూడా అనేక పోరాటాలు చేస్తున్నారని, వారణాసిలో మోడిపై నామినేషన్లు వేయడానికి అక్కడి నుండి100 మంది రైతులు వస్తున్నారని వెల్లడించారు. రైతులు పసుపు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బయలుదేరారు. తమ ఉద్యమానికి మద్దతుగా తమిళనాడు పసుపు రైతుల సంఘం అధ్యక్షులు పికె దైవశగామణి నాయకత్వంలో నామినేషన్లు వేయనున్నట్లు వెల్లడించారు.

DO YOU LIKE THIS ARTICLE?