వలస కార్మికులు, కూలీలు, చిరుద్యోగులకు రూ. 7 వేలు, 20 కిలోల బియ్యం

ఉపవాసదీక్షలో సిపిఐ నాయకుల డిమాండ్‌
కేంద్రం తక్షణమే రూ.10 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి
వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్ళేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వాలే భరించాలి
ప్రజాపక్షం / హైదరాబాద్‌; లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు, చేతి వృత్తిదారులు , చిరుద్యోగులకు రూ.7వేలు, 20 కిలోల బియ్యం చొప్పు న ఇవ్వాలని సిపిఐ నాయకులు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.10 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేయాలని కోరారు. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్ళేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వాలే భరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు సిబ్బందికి, ప్రైవేటు కంపెనీ ఉద్యోగులకు పలు చోట్ల రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, తక్షణమే వాటిని చెల్లించేలా ప్రభుత్వం కలెక్టర్‌ల ద్వారా చర్యలు తీసుకోవాలని సూచించించారు. లాక్‌డౌన్‌ కారణం గా ఇబ్బందులు పడుతున్న ప్రజలను, వలస కార్మికులను ఆదుకోవాలని, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని సిపిఐ జాతీయ సమి తి దేశవ్యాప్త పిలుపు మేరకు రాష్ట్రంలో సిపిఐ నాయకులు, శ్రేణులు సోమవారం ఒకరోజు ఉపవాస దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో 33 జిల్లా ల్లో 229 కేంద్రాల్లో నిర్వహించిన దీక్షలో మొత్తం 1557 మంది నాయకులు పాల్గొన్నారు. కాగా, హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో సిపిఐ  జాతీయ కార్యదర్శిడాక్టర్‌ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, ఎన్‌.బాల మల్లేశ్‌, కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ డి.సుధాకర్‌, బిసి హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి పాండురంగం, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ, సిపిఐ హైదరాబాద్‌ నగర నాయకులు రాకేశ్‌ దీక్షలో కూర్చున్నారు. వారికి ఉదయం 11 గంటలకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి పూల మాలలు వేసి దీక్షను ప్రారంభింపజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పార్టీ కార్యాలయాల్లో సిపిఐ నేత లు, కార్యకర్తలు భౌతిక దూరం పాటిస్తూ ఒక్క రోజు దీక్షలో పాల్గొన్నారు. మఖ్దూంభవన్‌లో సిపిఐ నేతల దీక్షకు తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జనసమితి సంఘీభావాన్ని ప్రకటించాయి. టిజెఎస్‌ అధ్యక్షులు ఎం.కోదండరా మ్‌, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రమణ దీక్షా శిబిరానికి వచ్చి సాయంత్రం ఐదు గంటలకు సిపిఐ నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

DO YOU LIKE THIS ARTICLE?