వరుసగా మూడో రోజూ 6వేలకు పైనే..

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత మూడురోజులుగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంట ల్లో అత్యధికంగా 6767పాజిటివ్‌ కేసులు నిర్ధార ణ అయ్యాయి. భారత్‌లో వైరస్‌ బయటపడ్డ తరువాత 24గంటల్లో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,31,868కి చేరింది. కొత్తగా 147మం ది మృత్యువాతపడడంతో మొత్తం కొవిడ్‌ సోకి మ రణించినవారి సంఖ్య 3867కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. కొవిడ్‌ బారిన పడిన వీరిలో ఇప్పటివరకు 54,441మంది కోలుకోగా మరో 73,560 మం ది చికిత్స పొందుతున్నారని తెలిపింది. రికవరీ రే టు 41.28గా ఉందని ఆరోగ్యమంత్రిత్వశాఖకు చెందిన ఒక సీనియర్‌ అధికారి చెప్పారు. శనివా రం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగా సంభవించిన 147 మరణాల్లో మహారాష్ట్ర లో 60, గుజరాత్‌లో 27, ఢిల్లీలో 23, మధ్యప్రదేశ్‌లో 9, రాజస్థాన్‌లో ఏడు, తమిళనాడులో ఐదు, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణలో నలుగురు చొప్పు న, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌, జ మ్మూకశ్మీర్‌, కర్నాటక, ఉత్తరాఖండ్‌లో ఒక్కరు చొప్పున ఉన్నారు. ఇక కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్యలోనూ మహారాష్ట్ర దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పుటి వర కు 1577 మంది మృతి చెందారు. అదే విధంగా గుజరాత్‌లో 829, మధ్యప్రదేశ్‌లో 281 పశ్చిమ బెంగాల్‌లో 269, ఢిల్లీలో 231, రాస్థాన్‌లో 160, ఉత్తరప్రదేశ్‌లో 155, తమిళనాడులో 103, ఆంధ్రప్రదేశ్‌లో 56 మంది, తెలంగాణలో 49, కర్నాటకలో 42, పంజాబ్‌లో 39, జమ్మూకశ్మీర్‌లో 21, హర్యానాలో 16, బీహార్‌లో 11 మంది మరణించారు. ఒడిశాలో ఏడుగురు, కేరళ, జార్ఖండ్‌, అసోంలో నలుగురు చొప్పున, చండీగఢ్‌, హిమాచల్‌ ముగ్గురు చొప్పున, ఉత్తరాఖండ్‌లో ఇద్దరు, మేఘాలయలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇక పాజిటివ్‌ కేసుల విషయానికొస్తే అత్యధికం గా మహారాష్ట్రలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 47,190 కేసులు నమోదు అ య్యాయి. తరువాత స్థానంలో ఉన్న తమిళనాడు లో 15,512 మంది కరోనా బారిన పడగా, గుజరాత్‌లో 13,664, ఢిల్లీలో 12,910, రాజస్థాన్‌ లో 6,742, మధ్యప్రదేశ్‌లో 6,371, ఉత్తరప్రదేశ్‌ లో 6,017, పశ్చిమ బెంగాల్‌లో 3,459, ఆంధ్రప్రదేశ్‌లో 2,757, బీహార్‌లో 2,380 మందికి కరోనా వైరస్‌ సోసింది. అదే విధంగా పంజాబ్‌లో 2,045, కర్నాటకలో 1,959, తెలంగాణలో 1,813, జమ్మూకశ్మీర్‌లో 1,569, ఒడిశాలో 1,269, హర్యానాలో 1,132, కేరళలో 795, జార్ఖండ్‌లో 350, అసోంలో 329, ఉత్తరాఖండ్‌ లో 244, చండీగఢ్‌లో 225, ఛత్తీస్‌గఢ్‌లో 214, త్రిపురలో 189, హిమచల్‌లో 185, గోవాలో 55, లడఖ్‌లో 49, అండమాన్‌ నికోబార్‌లో 33, మణిపూర్‌లో 29, పుదుచ్చేరిలో 26, మేఘాలయ లో 14, దాదర్‌ నగర్‌ హవేలీలో రెండు, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలో ఒక్కొక్క కేసు నమోదైంది. మిగిలిన 2,338 కేసులను రాష్ట్రాలు వెల్లడిస్తాయని మంత్రిత్వశాఖ వివరించింది.

DO YOU LIKE THIS ARTICLE?