వణికించిన ‘రాఫెల్‌’

న్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందం, రామ మందిర నిర్మాణం, కావేరీ నదీ జలాలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాలు గురువారం కూడా నిరసనలు కొనసాగించడంతో ఎలాం టి కార్యక్రమాలు కొనసాగకుండానే ఉభయ సభలు మళ్లీ వాయిదాపడ్డాయి. శీతాకాల పార్లమెంటు సమావేశంలో గురువారం మూడో రోజు. తొలి రోజు కీర్తిశేషులైన ప్రముఖు నివాళితో వాయిదాపడగా, బుధవారం రెండో రోజున లోక్‌సభ ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండానే వాయిదాపడింది. అయితే రాజ్యసభలో మాత్రం ఒక బిల్లు నిరసనల మధ్యనే ఆమోదం పొందింది. కానీ త ర్వాత వాయిదాపడింది. కావేరి నడి జలాల సమస్యపై తమిళనాడు రాజకీయ పార్టీలు సభ ‘వెల్‌’లో నిరసనలు చేపట్టడంతో రాజ్యసభ గురువారం ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండానే వాయిదాపడింది. సభ ప్రారంభం కాగానే 17 ఏళ్ల క్రితం పార్లమెంటుపై ఉగ్రవాదులు దా డులు జరిపినప్పుడు అసువులు బాసిన 17 మందికి అంజలి ఘటించారు. ఆ తర్వాత లిస్టెడ్‌ పత్రాలు ప్రవేశపెట్టగానే ఎఐఎడిఎంకె, డిఎంకె పార్టీల సభ్యులు సభ వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడం మొదలెట్టా రు. ‘తమిళనాడు హక్కులను కాపాడండి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని మరీ నిరసన ప్రదర్శించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరికొందరు సభ్యులు తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించాలని డిమాం డ్‌ చేశారు. సభ్యులు తమ సీట్లలోకి వెళ్లి కూర్చోకుండా సభాకార్యక్రమాలకు అడ్డు తగిలితే సభను వాయిదావేయాల్సి ఉంటుందని రాజ్యసభ చైర్మన్‌ ఎం వెంకయ్యనాయుడు హెచ్చరించారు. కావేరీ నది సమస్య సహా అన్ని అంశాలను చర్చకు అనుమతిస్తానన్నారు. ఆయన ఎన్నిసార్లు సభ్యులను అర్థించినప్పటికీ వారు పెడచెవినపెట్టారు. దాంతో వెంకయ్య నాయుడు రాజ్యసభను శుక్రవారానికి వాయిదావేశారు. నిరసనల నడుమ లోక్‌సభ గురువారం పదేపదే వాయిదాపడింది. ప్రశ్నోత్తర సమయంలో సభ రెండుసార్లు వాయిదాపడింది. శూన్యకాలం(జీరో అవర్‌)లో కూడా వాయిదిపడింది. అయితే శూన్యకాలంలో కేవలం ఇద్దరు సభ్యులకు మాత్రం మా ట్లాడే అవకాశం లభించింది. ప్రతిపక్షాలతోపాటు బిజెపి మిత్రపక్షమైన శివసేన కూడా అయోధ్యలో రామ మంది రం నిర్మాణానికి సంబంధించిన చట్టాన్ని తేవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపింది. శివసేన పార్టీ నాయకుడు ఆనంద్‌ రావు అద్సుల్‌ మాట్లాడుతూ ‘బిజెపి హిం దుత్వ ఆధారంగా పూర్తి మెజారిటీని సాధించి, ఇప్పుడు దానిని మరచిపోయింది. తమ రెండు పార్టీలు పొత్తుపెట్టుకోడానికి హిందుత్వమే ప్రధాన కారణం’ అన్నారు. ని రసనలు అవిరామంగా కొనసాగుతుండడంతో స్పీకర్‌ సు మిత్రా మహాజన్‌ ‘సభను కొంచెం పనిచేయనివ్వండి’ అన్నారు. కానీ ఆమె అభ్యర్థనను ఎవరూ వినిపించుకోలే దు. దాంతో సభ మరునాటికి వాయిదాపడింది. దీనికి ముందు 2001 లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వారికి నిరాజనం ఘటించాక ప్రశ్నోత్తర సమయం ఆరంభమైంది. కాంగ్రెస్‌, టిడిపి, ఎఐఎడిఎంకె సభ్యులు సభ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన నినాదాలు చేశారు. స్పీకర్‌ సభను నడిపే పరిస్థితిలేక వాయిదావేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యుడు వెంకటేశ్వర రావు (బాబు) అయితే కొత్త సభ్యుల ప్రమాణం కోసం బిగించిన ప్రాప్‌ అప్‌ మైకును ఉపయోగించారు. లోక్‌సభ సచివాలయం స్టాఫర్‌ ఆ మైకును ఉపయోగించకూడదని చెప్పి నా వినిపించుకోలేదు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కూడా ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినలేదు. దాంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆగ్రహంతో ‘మీ పేరు పేర్కొనాల్సి వ స్తుంది’ అని హెచ్చరించారు. సభలో కనుక స్పీకర్‌ సభ్యు డి పేరును పేర్కొంటే అతడు/ఆమె సభ నుంచి వెళ్లిపోవలసి ఉంటుంది. కాంగ్రెస్‌ సభ్యుడు సునీల్‌ జఖర్‌ సభ వెల్‌లో నిల్చున్నప్పుడు ప్రతిబింబించే నియోన్‌ చొ క్కాను వేసుకుని కనిపించారు. స్పీక ర్‌ దాదాపు 10 నిమిషాలపాటు అంటే ఉదయం 11.20 వరకు వాయిదావేశారు. తర్వాత మళ్లీ సభ సమావేశమైనప్పుడు సుమి త్రా మహాజన్‌ వివిధ నియమాల కింద సభ్యులు అంశాలను లేవనెత్తవచ్చన్నారు. 2019లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది పార్లమెంటు కీలక సమయమని, దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లోక్‌సభ అనేది అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు సంబంధించిందని, కనుక సభ్యులందరికీ అవకాశం ఇవ్వాలన్నారు. ఆమె ఎంతగా చెప్పినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వినిపించుకోకుండా సభ వెల్‌లోకే వచ్చారు. గందరగోళం నేపథ్యంలో సభను 30 నిమిషాలపాటు మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

DO YOU LIKE THIS ARTICLE?