లోయర్‌ ఆర్డర్‌ మెరుగుపడాలి : బంగర్‌

ఆడిలైడ్‌: భారత లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మెరుగుపడాల్సిన అవసరం ఉందని భారత బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత టాప్‌ ఆర్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్లు బ్యాటింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్లు మాత్రం పేలవంగా ఆడుతున్నారు. రెండు ఇన్నింగ్స్‌లలో వీరు ఘోరంగా విఫలమయ్యారు. అదే ఆసీస్‌ జట్టులో లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్లు మాత్రం ఎప్పటిలాగే అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకొంటున్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగులలోపే ఆ జట్టు కీలకమైన బ్యాట్స్‌మన్లు పెవిలియన్‌ చేరారు. కానీ, చివర్లో లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్లు మాత్రం అసాధరణ పోరాటం చేసి ఆ జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. అలాగే.. భారత లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్లు కూడా చెరో 20-30 పరుగులన్న చేసి తమ జట్టుకు అండగా ఉండాలని ఆయన కోరారు. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో చివరి ఏడు వికెట్లను 73 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. రిషభ్‌ పంత్‌ ఔటైన తర్వాత చివరి ఐదు వికెట్లు 25 పరుగుల వ్యవధిలోనే చేజార్చుకోవడం గమనర్హం. చివరి బ్యాట్స్‌మన్లు కూడా పరుగులు చేయడంలో తమ వంతు సహకారం అందిస్తే భారత్‌కు తిరుగే ఉండదని ఆయన అన్నారు. తర్వాతి మ్యాచ్‌లోనైన భారత లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్లు మెరుగైన ఆటను కనబర్చుతారని ఆశిస్తున్నానని బంగర్‌ తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?