లాక్‌డౌన్‌ వేళ పెరుగుతున్న గృహహింస కేసులు

ఒక్క ఏప్రిల్‌లోనే ఎన్‌సిడబ్ల్యుసి 315 ఫిర్యాదులు
న్యూఢిల్లీ : దేశంలో లాక్‌డౌన్‌ వేళ గృహహింస కేసులు అధికమవుతున్నాయి. పెళ్లి చేసుకోవాలని తనను భౌతికంగా వేధిస్తున్నారని ఓ బాలిక, అత్తవారింట్లో తన సోదరిపై దాడులకు పాల్పడ్డారని, ఆమెకు రక్షణ కల్పించాలని ఓ వ్యక్తి కోరిన ఘటనలు సహా గృహసింసకు సంబంధించిన ఏప్రిల్‌లో జాతీయ మహిళా కమిషన్‌కు (ఎన్‌సిడబ్ల్యు) 315 ఫిర్యాదులు అందాయి. ఈ ఫర్యాదులను ఆన్‌లైన్‌, వాట్సాప్‌ ద్వారా చేశారు. అయితే పో స్టు ద్వారా గత నెలలో ఎలాంటి ఫిర్యాదులు ఎన్‌సిడబ్ల్యుకు రాలేదు. కాగా, గత ఆగస్టు నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో ఇవే అత్యధికమని ఎన్‌సిడబ్ల్యు గణాంకాలు తెలియజేస్తున్నాయి. గడిచిన నెలల్లో ఎన్‌సిడబ్ల్యుకి ఫిర్యాదులు ఆన్‌లైన్‌, పోస్టు ద్వారా వచ్చేవి. మార్చి 25న లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి బాధితులు, నిందితులు ఇంటికే పరిమితం కావడంతో గృహహంస కేసుల సంఖ్య పెరిగిపోతోందని ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్‌ రేఖా శర్మ తెలిపారు. గృహహింసకు సంబంధించిన ఫి ర్యాదులను నమోదు చేసేందుకు ఎన్‌సిడబ్ల్యు వా ట్సాప్‌ నెంబర్‌ 7217735372ను ప్రారంభించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో వచ్చిన గృహహింస ఫిర్యాదుల్లో కొన్ని కేసులను ఎన్‌సిడబ్ల్యుసి తెలియజేసింది. వాటిలో ఒ కేసును పరిశీలిస్తే.. పెళ్లి చేసుకోవాలని తన తల్లిదండ్రులను తనను కొడుతున్నారని ఓ బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. బాలిక ఫిర్యాదు మేరకు ఎన్‌సిడబ్ల్యు పోలీసులను సంప్రదించగా, ఆ బాలికను షెల్టర్‌ హోమ్‌కు తరలించారు. మరో కేసును చూ స్తే త్రిపురకు చెందిన ఓ వ్యక్తి తన సోదరిని అత్తవారింట్లో భౌతికంగా హింసిస్తున్నారని, లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున ఆమె ఎక్కడికీ వెళ్ల లేకపోతోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో తాము పోలీసుల సమన్వయంతో ఆమెను రక్షించినట్లు ఎన్‌సిడబ్ల్యు సభ్యులు చెప్పారు. అదే విధంగా మ హిళలు తమను అత్తమామల బయటకు గెంటేశారంటూ కూడా ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి కేసు కూడా భిన్నమైనదని, ఏ కేసుకు ఏది అవసరమో దాని ప్రకారం తాము స్పందిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. సహాయం కోరుతూ మహిళలు సంప్రదించేందుకు, నేరాలను నమోదు చేసేందుకు వీ లుగా అనేక హెల్ప్‌పైన్‌ నెంబర్లను ప్రారంభించా రు. మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాలకు సంబంధించి మొత్తం 800 ఫిర్యాదులు అందిన ట్లు ఎన్‌సిడబ్ల్యు గణాంకాల ద్వారా వెల్లడయిం ది. అందులో 40 శాతం ఫిర్యాదులు గృహహింస కు సంబంధించినవే కావడం గమనార్హం. ఇతర నేరాలు కూడా ఏప్రిల్‌లో క్రమంగా పెరిగాయి. ఏ ప్రిల్‌ 54 సైబర్‌ ఫిర్యాదులు (ఆన్‌లైన్‌) రాగా, మార్చి 37 (ఆన్‌లైన్‌, పోస్ట్‌), ఫిబ్రవరిలో 21 (ఆన్‌లైన్‌, పోస్ట్‌) వచ్చాయి. లాక్‌డౌన్‌ వల్ల ఏప్రిల్‌ కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే ఫిర్యాదులు అందాయి.

DO YOU LIKE THIS ARTICLE?