లాక్‌డౌన్‌ పొడిగింపు

కంటైన్‌మెంట్‌ జోన్లలో ఈనెల 31వ తేదీ వరకు
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ప్రజాపక్షం / హైదరాబాద్‌  రోజు రోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను జులై 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారం కంటైన్‌మెంట్‌ జోన్లలో లాన్‌డౌన్‌ను పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన లాక్‌డౌన్‌ ఉత్తర్వుల ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వర కు అత్యవసరం (మెడికల్‌ ఎమర్జెన్సీ) అయి తే తప్ప ఎవరూ బయటకు రాకూడదు. ఆసుపత్రులు, మెడికల్‌ షాపులు, అత్యవసరాల దుకాణాలు తప్ప మిగితా షాపులు ఏవీ రాత్రి 9.30 గంటల తర్వాత తీసి ఉంచడానికి వీలు లేదు. అత్యవసర సేవలకు సంబంధించిన వారికి మాత్రమే బస్సులు, రైళ్లు, విమానల ద్వారా ప్రయాణానికి అనుమతి ఉం టుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ బుధవారం ఉత్తర్వులు (జిఓ 93) జారీ చేశారు. విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత శాఖల అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు.

DO YOU LIKE THIS ARTICLE?