లాక్‌డౌన్‌ అమలులో కేంద్రం విఫలం

న్యూఢిల్లీ: లాక్‌ వైరస్‌ను కట్టడి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం విఫలమైందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. నాలుగు దశల లాక్‌డౌన్‌ ఎలాంటి ఫలితాలివ్వలేదన్నారు. కొవిడ్‌ కేసులు ఎక్కవవుతున్న తరుణంలో ప్రపంచంలో ఆంక్షల్ని ఎత్తివేస్తున్న ఏకైక దేశం భారత్‌ అని ఎద్దేవా చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తున్న దాని కట్టడికి కేంద్ర ప్రభుత్వం అనుసరించబోయే ప్రణాళికలేంటో వివరించాలని రాహుల్‌ అలాగే రాష్ట్రాలకు, వలస కూలీలకు ఎలా అండగా నిలవనుందో తెలపాలని డిమాండ్‌ చేశారు. భారత్‌లో రెండో విడత కరోనా విజృంభిస్తే దాని పరిణామాలు మరింత తీవ్రంగా ఉండనున్నాయని రాహుల్‌ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రజల చేతుల్లోకి డబ్బు చేర్చాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో పేదల జీవితాలు మరింత దుర్భర స్థితిలోకి జారుకునే ప్రమాదం ఉందన్నారు. పరిశ్రమలకు కూడా ప్రభుత్వమే అండగా నిలవాలన్నారు. ఈ సమయంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సాయం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా కేంద్రం మద్దతు లేకపోతే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు మనుగడ సాగించడం కష్టతరమవుతుందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?