లక్ష్యాలను ధ్వంసం చేశాం

స్పష్టీకరించిన ఐఎఎఫ్‌ చీఫ్‌ బిఎస్‌ ధనోవా
వాయుసేన మృతుల సంఖ్యను లెక్కించదు!
ప్రభుత్వమే వివరాలు వెల్లడిస్తుందని ప్రకటన

కోయంబత్తూరు: బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు కచ్చితమైన లక్ష్యాలను ధ్వంసం చేశాయని వైమానిక దళాధిపతి బిఎస్‌ ధనోవా సోమవారం స్పష్టం చేశారు. మరణించ వారి సంఖ్యపై వాడిగావేడిగా చర్చ లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పంది స్తూ ‘చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్యపై ప్ర భుత్వమే వివరాలు అందించగలదు, వాయుసేన కేవలం లక్ష్యాన్ని ఛేదించామా, లేదా అనే ది మాత్రమే చూస్తుంది’ అని అన్నారు. మృతు ల సంఖ్యను వాయుసేన లెక్కించదని కూడా స్పష్టం చేశారు. పూలామా ఉగ్రదాడి అనంతరం ఏర్పడ్డ ఉద్రిక్త వాతావరణం అనంతరం ఆయన తొలిసారిగా స్పందించారు. కాగా ఫిబ్రవరి 26న జరిగిన మెరుపుదాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ వర్గాలు 350 వరకు ఉగ్రవాదులు చనిపోయి ఉంటారంటుండగా, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా 250 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉం టారని అంటున్నారు. కొన్ని మీడియా వార్తా కథనాలు నష్టం అతిస్వల్పమేనని చెప్పాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు స్పష్టతను కోరుతున్నాయి. కానీ అధికారికంగా మాత్రం ఎంత అనేది ఇంకా వెల్లడికాలేదు. పాకిస్థాన్‌ నిర్బంధంలో మూడు రోజులు నిర్బంధంలో ఉంది, శారీరక,మానసిక వేదనలకు గురైన వింగ్‌ కమాండర్‌ విలేకరుల సమావేశంలో ‘అభినందన్‌ తిరిగి విధుల్లోకి చేరుతారా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ బిఎస్‌ ధనో ‘ఒకవేళ ఆయన పూర్తిగా కోలుకుంటే తిరిగి యుద్ధ విమానాన్ని నడుపుతారు. అయితే పైలట్‌ మెడికల్‌ ఫిట్‌నెస్‌పై మేము ఎలాంటి ఛాన్సులు తీసుకోబోం’ అని తెలిపారు. ‘బాలాకోట్‌ వైమానిక దాడుల్లో ఎంతమంది చనిపోయారనేది మేము లెక్కించం. అది అక్కడ ఎంత మంది ఉండేవారన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారనేదానిపై ప్రభుత్వమే ప్రకటనచేస్తుంది’ అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?