రైల్వే ఫ్లాట్‌ఫారమ్‌ టికెట్‌ రూ. 50

ప్రజాపక్షం / హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను నివారించే చర్యల్లో భాగంగా ప్రయాణికులతో పాటు వచ్చే వారి రద్దీని నియంత్రించేందుకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోఫ్లాట్‌ ఫారమ్‌ టికెట్‌ ధరను రూ.10 నుంచి రూ.50కి పెంచారు. కరో నా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ధర పెంచితే ప్రయాణికులతో పాటు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని, మొత్తం 583 రైల్వే  స్టేషన్లలో ఫ్లాట్‌ ఫారమ్‌ టికెట్లను పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సిఆర్‌) ఒక ప్రకటనలో తెలియజేసింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిత్యం 1.80 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. వీరికి వీడ్కోలు పలికేందుకు మరో 50 వేల మంది వరకు వస్తుంటారని రైల్వేశాఖ లెక్కలు వేసింది. ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కరోనా వైరస్‌ సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడం వల్ల ఫ్లాట్‌ ఫారమ్‌ టికెట్‌ ధర పెంచాలని అధికారులు నిర్ణయించారు.

DO YOU LIKE THIS ARTICLE?