రైతు రుణమాఫీ 4 దఫాలు

రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడం
దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి
రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోంది
వచ్చే పదేళ్లలో రాష్ట్రం రూ.30 లక్షల కోట్ల బడ్జెట్‌ ఖర్చు
అప్పుల విషయంలో ఎఫ్‌ఆర్‌బిఎం పరిధి దాటలేదు
స్థానిక సంస్థలను అద్భుతంగా, కీలకంగా తీర్చిదిద్దే బాధ్యత మాదే
పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎంపిటిసి, జెడ్‌పిటిసి, మున్సిపల్‌ ఎన్నికలు
ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చకు సమాధానమిచ్చిన సిఎం కెసిఆర్‌
ఉభయ సభలు సోమవారానికి వాయిదా
హైదరాబాద్‌ : రైతులకు నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శాసనసభలో ప్రకటించారు. రైతులు ఎలాంటి ఆం దోళనకు గురికావొద్దని, ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు పక్షపాతిగా ఉంటుందన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సిఎం విమర్శించారు. వచ్చే పదేళ్లలో రాష్ట్రం రూ.30 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేయనుందని ఆయన వెల్లడించారు. అప్పుల విషయంలో ఎఫ్‌ఆర్‌బిఎం పరిధి దాటలేదని, దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగా ణ ఒకటని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థలను అద్భుతంగా, కీలకంగా తీర్చిదిద్దే బాధ్య త తమదేనన్నారు. విపక్షాలు కనీస అవగాహ న లేకుండా ఆరోపణలు చేస్తున్నాయని సిఎం కెసిఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ లో శనివారం జరిగిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ స మాధానమిచ్చారు. కాంగ్రెస్‌ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చర్చను ప్రారంభించగా కాంగ్రెస్‌ సభ్యులు పి. సబితా ఇంద్రారెడ్డి, ఎంఐఎం స భ్యులు మహ్మద్‌ మోజాంఖాన్‌, టిడిపి సభ్యు లు సండ్ర వెంకటవీరయ్య, బిజెపి సభ్యులు టి. రాజాసింగ్‌, టిఆర్‌ఎస్‌ సభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు అందజేసే ఆలోచన చేస్తున్నట్లు సిఎం వెల్లడించారు. రైతులపై వడ్డీభారం పడకుండా చర్యలు తీసుకుంటామని, వడ్డీతో కలి పి రుణమాఫీ చెక్కులు చెల్లిస్తామని సిఎం వివరించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం రు ణమాఫీ చేయగా బ్యాంకర్లు రైతులను ఇబ్బం ది పెట్టారని, రుణాలు తీసుకున్న రైతుల ఖా తాల్లో రుణమాఫీ నగదును జమ చేయగానే లబ్ధిదారుల నుంచి బ్యాంకర్లు వడ్డీ కట్‌ చేసుకున్న సంఘటనలు కొన్నిచోట్ల జరిగాయని, మరోసారి రైతులకు అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు అందజేయడానికి కృషి చే స్తున్నామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?